రూ.2000 నోట్లు తీసుకోబడవు.. వైన్ షాపు ఎదుట బోర్డు

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-22 06:54:02.0  )
రూ.2000 నోట్లు తీసుకోబడవు.. వైన్ షాపు ఎదుట బోర్డు
X

దిశ, మక్తల్: రెండు వేల రూపాయల నోట్లు తీసుకోబడవు అంటూ వైన్స్ షాప్ నిర్వాహకులు షాపు ముందు ఏకంగా బోర్డునే తగిలించారు. రూ.2000 రూపాయల నోట్ల మార్పిడి చేసుకోవడానికి గడువు ఉన్నప్పటికిని మక్తల్ పట్టణంలోని ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వైన్ షాప్ నిర్వాహకులు ఇలా బోర్డులు పెట్టడంతో మందుబాబులు ఇబ్బందులకు గురవుతున్నారు.

ఇదేంటి అని ప్రశ్నించిన పలువురిని బెదిరించినట్లు తెలుస్తుంది. ఇదే విషయమై మీడియా ప్రతినిధి ఒకరు వైన్ షాప్ వద్దకు వెళ్లి నిర్వాహకులతో మాట్లాడే ప్రయత్నం చేయగా దురుసుగా సమాధానం ఇవ్వడంతో పాటు ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారు. స్థానిక పోలీసులకు, వైన్ షాప్ నిర్వాహకులకు పలువురు ఫిర్యాదు చేసినప్పటికిని వారు కుంటి సాకులు చెబుతూ తప్పించుకుంటున్నారని పలువురు వాపోతున్నారు. ఈ విషయమై అధికారులు స్పష్టతను ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.

Read More: రూ.2000 నోట్ల మార్పిడికి ఎస్‌బీఐ కీ ఇన్‌స్ట్రక్షన్స్

Advertisement
Next Story

Most Viewed