- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో రాయలసీమ ఫ్యాక్షనిజం.. RS ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేత, నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో రాయలసీమ ఫ్యాక్షనిజం నడుస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. పది రోజుల క్రితం రాష్ట్ర డీజీపీని కలిసి పరిస్థితి వివరించామని తెలిపారు. శ్రీధర్ రెడ్డి కేసులో ఇప్పటివరకు ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకోలేదు అన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మనుషులే హత్య చేశారని తల్లిదండ్రులు చెప్పారు.
నిందితులను ఎక్కడ దాచారో జూపల్లి చెప్పాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. పోలీసులు కాంగ్రెస్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. దీనిపై సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించాలని కోరారు. కొల్లాపూర్‌ను కల్లోల ప్రాంతంగా ప్రకటించాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి జూపల్లి ఒక హార్డ్ కోర్ ఫ్యాక్షనిస్ట్ అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఫ్యాక్షన్ రాజకీయాలు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. శ్రీధర్ రెడ్డి హత్య కేసులో మంత్రి జూపల్లి ప్రమేయం లేకపోతే సిట్ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని అడిగారు.