‘మళ్లీ చెప్తున్న.. ముమ్మాటికీ మీది పిరికిపందల ప్రభుత్వమే’

by GSrikanth |
‘మళ్లీ చెప్తున్న.. ముమ్మాటికీ మీది పిరికిపందల ప్రభుత్వమే’
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ సర్కార్, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీఎస్‌పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం జారీ చేస్తోన్న రహస్య జీవోలపై స్పందిస్తూ మండిపడ్డారు. ‘‘తెలంగాణ పునర్నిర్మాణం సంగతి ఏమో గాని, తెలంగాణ దోపిడీ మాత్రం రహస్యంగా, యథేచ్చగా జరుగుతనే ఉన్నది. అంతా సవ్యంగానే ఉంటే జీవోలను వెబ్ సైట్లలో పెట్టడానికి ఎందుకు జంకుతున్నరు కేసీఆర్ గారూ.? అందుకే మళ్లీ అంటున్న మీది ముమ్మాటికీ పిరికిపందల ప్రభుత్వమే.’’ అంటూ ఘాటుగా సోషల్ మీడియా వేదికగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


Advertisement

Next Story