- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి.. కేటీఆర్‌కు దమ్ముంటే నాకు నోటీసులు పంపాలి: RSP (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లీకేజీ వ్యవహారమంతా సీఎం కార్యాలయం కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపించారు. అంతేగాక, ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వ్యక్తులను కాపాడేందుకు సీఎం కుటుంబం, సీఎం కార్యాలయ సిబ్బంది ఎంతగానో ప్రయత్నం చేస్తోందని అన్నారు. ఈ కేసులో నిందితులను బాధితులుగా మార్చి, కాపాడేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో ఇంత పెద్ద ఇష్యూ జరిగినా ముఖ్యమంత్రి దీనిపై స్పందించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ నిరుద్యోగులతో బీఆర్ఎస్ సర్కార్ చెలగాటం ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పార్టీ కార్యాలయం లాగా ప్రగతి భవన్‌ను మార్చేశారని మండిపడ్డారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి తనవద్ద అన్నీ ఆధారాలు ఉన్నాయని, మంత్రి కేటీఆర్‌కు దమ్ముంటే తనకు నోటీసులు పంపించాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే ఈ వ్యవహారంపై కేసీఆర్ స్పందించి తమకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని చెప్పాలని డిమాండ్ చేశారు.