- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
TRS పందికొక్కులను తరిమికొట్టాలి.. RSP పిలుపు
దిశ, తెలంగాణ బ్యూరో: కనీస సౌకర్యాలు లేక గతకొన్ని రోజులుగా ఇబ్రహీంపట్నం కేజీబీవీ విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ ఘటనపై అమెరికా పర్యటనలో ఉన్న బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శనివారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. నీళ్ల కోసం, చదువు కోసం ఈ కేజీబీవీ విద్యార్థుల గోస చూస్తుంటే కడుపు తరుక్కుపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పందికొక్కులను తరమక పోతే మన బిడ్డల భవిష్యత్తు నాశనమైపోవడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను తరిమి రాష్ట్రాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.
అధికారమిస్తే పేదలకు ఒక ఎకరం భూమి ఇస్తాం: ఆర్ఎస్పీ హామీలు
డల్లాస్ నగరంలో గ్లోబల్ ఎన్ఆర్ఐ ఫోరం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ సమావేశంలో ఆర్ఎస్పీ ప్రసంగించారు. బీఎస్పీ పార్టీకి అధికారమిస్తే రాష్ట్రంలోని ప్రతి పేదలందరికీ ఒక ఎకరం భూమి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇళ్ళు లేని పేదలందరికీ రెండు సంవత్సరాల్లో ఇల్లు నిర్మిస్తామన్నారు. ప్రతి ప్రభుత్వ కాంట్రాక్టుల్లో జనాభా ప్రాతిపదికన భాగస్వామం ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఇంటర్‌నేషనల్ రెసిరెన్షియల్ స్కూల్స్ తీసుకొస్తామన్నారు. ప్రతి పేద ఇంటి నుంచి ఉన వ్యక్తి వ్యక్తిని ఉన్నత చదువుల నిమిత్తం ఫారెన్ పంపిస్తామని అన్నారు. స్వయం ఉపాధి రంగాలను ప్రోత్సహిస్తామన్నారు. బెల్ట్ షాపులను పూర్తిగా నిషేదిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులను మెరుగుపరుస్తామని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు.
కొండ చిలువలకు చలి చీమలకు జరుగుతున్న యుద్ధం
రాష్ట్రంలోని ప్రస్తుత పాలకులతో 'కొండ చిలువలకు చలి చీమలకు జరుగుతున్న యుద్ధం' చేస్తున్నామని, చలి చీమలే గెలుస్తాయని, అదేవిధంగా బీఎస్పీ పార్టీ కూడా కచ్చితంగా యుద్ధంలో గెలుస్తుందని వివరించారు. మన పాలకులు ప్రజలను నిర్లక్ష్యం చేస్తూ జేబులు నింపుకోవడంలో బిజీగా ఉన్నారని అన్నారు. ఇటీవల పోర్చుగీసులో ఒక ఇండియన్ టూరిస్ట్ సకాలంలో అంబులెన్సు రాక చనిపోతే అక్కడి ఆరోగ్య శాఖ మంత్రి ఆరు గంటల వ్యవధిలో నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారని గుర్తు చేశారు. కానీ, మన రాష్ట్రంలో ప్రభుత్వ అస్పత్రుల్లో ఎంతో మంది ప్రభుత్వ నిర్లక్ష్యంతో చనిపోతున్నా.. ఇప్పటి వరకు మన ఆరోగ్యశాఖ మంత్రి రాజీనామా చేయలేదని అన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నాశనం అయ్యిందన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో కేవలం 8 వేల కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు. యూనివర్సీటిల్లో ప్రొఫెసర్‌లు లేరని, హాస్టల్ విద్యార్థులకు ఆహారంలో కప్పలు, బొద్దింకలు వస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా.. సీఎం కేసీఆర్ మాత్రం అవేవి పట్టించుకోకుండా పీఎం అవ్వడం కోసం దేశ పర్యటన చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజల సొమ్మును దోచుకున్నది సరిపోక సీఎం దేశ ప్రజల సొమ్మును కూడా దోచుకోవడానికి వెళ్ళాడాని ఎద్దేవా చేశారు. తాను అధికారంలోకి వస్తే ముఖ్యంగా విద్యా వ్యవస్థను ఉన్నత స్థాయికి తీసుకు వస్తానని హామీ ఇచ్చారు.