- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KCR ఆఫీస్‌లోనే TSPSC పేపర్ లీకేజీకి కుట్ర: RSP సెన్సేషనల్ కామెంట్స్
దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీల కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన 42 మంది కేవలం పాత్రధారులే అని అసలైన సూత్రధారులు అరెస్టు కాలేదని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. సీఎం కార్యాలయంలోనే లీకేజీ కుట్ర జరిగిందని, అక్కడి వారు అరెస్టు అయితేనే కేసుకు ఫుల్ స్టాప్ పుడుతుందని ఆరోపించారు.
శనివారం బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 71 రోజులుగా టీఎస్పీఎస్సీ లీకేజీ కేసు నడుస్తూనే ఉందని, కానీ పదో తరగతి పేపర్ లీకేజీ కేసులో వెంటనే పట్టుకున్నారని అన్నారు. టీఎస్పీఎస్సీ లీకేజి మీద ఎందుకు వివరణ ఇవ్వడం లేదని నిలదీశారు. నేరస్తులు ఎవరో తెలియకుండానే, నేరస్తులు బోర్డులో ఉండగానే పరీక్షలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు.
బోర్డు ప్రక్షాళన చేసిన తర్వాతనే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కేసులో బోర్డు చైర్మన్, సెక్షన్ ఆఫీసర్ శంకర లక్ష్మీని ఎందుకు నిందితులుగా వారి పేర్లు చేర్చలేదని ప్రశ్నించారు. చైర్మన్ దగ్గర ఉండాల్సిన యూజర్ ఐడీ, పాస్ వర్డ్ శంకర లక్ష్మీ డైరీ నుంచి ఆ విషయాలు ఎలా బయటకు వచ్చాయి? ఆమె డైరీని సీజ్ చేశారా? సమాధానం చెప్పాలన్నారు. శంకర లక్ష్మి సిట్‌కు పూర్తిగా అబద్ధాలు చెప్పిందని ఆరోపించారు. సెక్షన్ ఆఫీసర్‌గా శంకర లక్ష్మి 8 ఏళ్లుగా కాన్ఫిడెన్షియల్ రూం వద్ద ఎలా పని చేస్తున్నారని ప్రశ్నించారు. ఎలా ఇన్ని రోజులు ఒకే పోస్టులో ఎలా కొనసాగుతారని, ఆమె చట్టానికి అతితులా? అని నిలదీశారు.
లిక్కర్ కేసులో ఢిల్లీ గవర్నర్ సీబీఐకి లేఖ రాశారని, కానీ పేపర్ లీకేజీల విషయంలో తెలంగాణ గవర్నర్ చర్యలు తీసుకోమని కేంద్రానికి ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు. లిక్కర్ కేసులో మనీష్ సీసోడియాను అరెస్టు చేశారు.. లంచం ఇచ్చిన ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడం లేదన్నారు. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒక్కటే అని అర్థం అవుతుందని విమర్శించారు.
దశాబ్ది ఉత్సవాలను ప్రజలు బహిష్కరించాలి
పదేళ్లు ప్రజలను వంచించిన ప్రభుత్వం, హంతకులే పాడే మోసినట్లు ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తుందని విమర్శించారు. ఈ దశాబ్ది ఉత్సవాలను ప్రజలు బహిష్కరించాలని ఆర్ఎస్పీ పిలుపునిచ్చారు. 105 కోట్ల ప్రజాధనంతో దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారని అన్నారు. అమరుల కుటుంబాలను ఆదుకోలేదు.. త్యాగాలు తెలంగాణ ప్రజలవి భోగాలు కేసీఆర్ కుంటుబానివా అని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో రోజు ఒక్కో వేడుకలు నిర్వహిస్తున్నారని, ఆయా శాఖల వైఫల్యాలను, ఇచ్చిన హమీలను ఎందుకు అమలు చేయలేదని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రజల సమస్యలన్ని అలాగే ఉన్నాయని, ఈ ఉత్సవాలలో తాము ప్రజలకు వివరిస్తామని తెలిపారు. దశాబ్ది ఉత్సవాలలో మంత్రులను, ప్రజా ప్రతినిధుల ను అడగవలసిన సమాచారం ప్రజలకు తాము ఇస్తామని అన్నారు. కొందరి తెలంగాణ వద్దు అందరి తెలంగాణ కావాలనే నినాదంతో పోరాడుతామని అన్నారు.
Read More... తిరగబడుతున్న జనం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో టెన్షన్!