RS Praveen Kumar: గురుకుల బాట అనగానే సర్కార్‌కు భయం పుట్టింది.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాట్ కామెంట్స్

by Shiva |
RS Praveen Kumar: గురుకుల బాట అనగానే సర్కార్‌కు భయం పుట్టింది.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గురుకుల పాఠశాలను సందర్శించి అక్కడి భోజనం మెనూ, విద్యార్థుల సమస్యలను తెలుసుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) బీఆర్ఎస్ (BRS) నేతలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా.. ప్రభుత్వంపై బీఆర్ఎస్ (BRS) కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురుకుల బాట అనగానే కాంగ్రెస్ సర్కార్‌ (Congress Government)కు భయం పుట్టిందని కామెంట్ చేశారు. ఫుడ్ పాయిజన్ (Food Poison) ఘటనల వెనుక తన హస్తం ఉందంటూ మంత్రి కొండా సరేఖ (Minister Konda Surekha) నిరాధారమైన ఆరోపణలు చేశారని ఫైర్ అయ్యారు. తెలంగాణ (Telangana) ప్రజలు గతంలోనే కొండా సురేఖను తిరస్కరించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మహిళలపై చేసిన ఆరోపణలకు ఆమెపై కేసు పెట్టాలంటూ కోర్టు ఇటీవలే తీర్పును ఇచ్చిందని గుర్తు చేశారు. కొండా సురేఖ (Konda Surekha)కు పదవిలో కొనసాగే కనీస అర్హత లేదని అన్నారు. గతంలో ఓ ఐపీఎస్ (IPS) అధికారిగా ఉన్న తనకు కేంద్ర ప్రభుత్వం (Central Government) అవార్డు ఇచ్చిందని.. ఏడేళ్ల సర్వీస్‌ను వదిలి విద్యార్థుల బాగోగుల కోసం రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. అలాంటి తాను విద్యార్థులకు కలుషిత ఆహారం పెట్టానని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒకవేళ తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలుంటే బయటపెట్టాలని.. సీబీఐ విచారణ (CBI Investigation)కు ఆదేశించాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మంత్రి సురేఖకు సవాల్ విసిరారు.

Advertisement

Next Story