- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విమానాలు కొనేంత ఫండ్ ఉన్న మీరు.. సర్కార్ ఖజానాకు చిల్లు పెట్టకండి: RSP ఫైర్
దిశ, డైనమిక్ బ్యూరో: కోకాపేటలో బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర ప్రభుత్వం 11 ఎకరాల భూమిని కేటాయించడంపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్పీ మండిపడ్డారు. రూ.550 కోట్ల విలువైన 11 ఎకరాల భూమిని కేవలం రూ.37 కోట్లకే బీఆర్ఎస్ పార్టీకి కట్టబెడుతూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడాన్ని బీఎస్పీ ఖండిస్తోందన్నారు. ఈ అంశంలో ప్రభుత్వ వైఖరి నిర్లజ్జగా ఉందని.. ఇది విచ్చలవిడిగా దోపిడీ విధానం అని మండిపడ్డారు. ఓ వైపు హెచ్ఎండీఏ పరిధిలో వేల ఎకరాల పేదల అసెండ్ భూములను గుంజుకొని బహిరంగ వేలం వేస్తూ, వేల కోట్లు ప్రభుత్వం సంపాదిస్తూ మరోవైపు తమ పార్టీ కార్యాలయాల కోసం మాత్రం మార్కెట్ రేటు కన్నా 10 రేట్లు తక్కువగా కొనడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు.
గత గురువారం రాష్ట్ర సమావేశం అయిన రాష్ట్ర మంత్రివర్గం రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని కోకాపేట గ్రామంలో ఉన్న 11 ఎకరాల భూమిని బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయబోయే ఇన్ స్టిట్యూట్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కోసం కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పేరిట చేసిన ఈ ప్రతిపాదన సముచితమే అని భూపరిపాలన శాఖ (రెవెన్యూ) పెట్టిన నోట్‌కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
ఈ నిర్ణయంపై ఆర్ఎస్పీ ఆదివారం ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. పార్టీ ఫండ్‌తో విందు, వినోదాల కోసం విమానాలు కొనుక్కొన్న మీరు అదే పార్టీ ఫండ్‌తో బహిరంగ మార్కెట్ రేటు ప్రకారం భూములు కొనుక్కోవాలి గానీ ప్రభుత్వ ఖజానాకు చిల్లులు పెట్టొద్దని ఫైర్ అయ్యారు. ఈ అంశంలో రాష్ట్ర కేబినెట్ నిర్ణయం అత్యంత రహస్యంగా ఉంచడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే బహుజన రాజ్యంలో మీరు దోపిడీ, దౌర్జన్యంతో ఆక్రమించి సంపాదించిన ఆస్తులను తిరిగి ప్రజలకు పంచుతామన్నారు.