- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొండగట్టుకు రూ.500 కోట్ల భారీ ఆర్థిక సాయం బోగస్: RS ప్రవీణ్ కుమార్
దిశ, తెలంగాణ బ్యూరో: కొండగట్టు ఆలయానికి గతంలో ఇచ్చిన రూ. 100 కోట్ల హామీని నెరవేర్చని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇకపైన రూ. 500 కోట్లు ఇస్తామనే హామీని ఎలా నమ్మాలని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. గతంలో కొండగట్టు ఆలయ దర్శనానికి వెళ్ళిన భక్తులు బస్సు ప్రమాద ఘటనలో మృతి చెందారని, కనీసం బాధిత కుటుంబాలను ఇప్పటికీ పట్టించుకోలేదని, పరామర్శించలేదని ఆరోపించారు. ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు ఇస్తామని ఇటీవలే హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పటివరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని, ఇక రూ. 500 కోట్లు అంటూ భారీ హామీలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. 'అవసరమైతే వెయ్యి కోట్లయినా..' అంటూ కేసీఆర్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.
కేసీఆర్ ఇప్పటివరకు ఇచ్చిన హామీలు, వాటిని తుంగలో తొక్కిన తీరు తదితరాలపై ఒక హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ తీసి దాని ద్వారా వచ్చిన కలెక్షన్ల డబ్బుతో తెలంగాణను కాపాడాలేమో, ఆ హామీలను నెరవేర్చాలేమో అని సెటైర్ వేశారు. కొండగట్టు ఆలయానికి వెళ్ళి ప్రత్యేక పూజలు చేసి టెంపుల్ డెవలప్‌మెంట్ మాస్టర్ ప్లాన్‌పై వాస్తు సలహాదారు, ఆలయ ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి, పలువురు జిల్లా అధికారులతో కేసీఆర్ బుధవారం సమీక్ష చేసిన తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కామెంట్లు చేశారు.