- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ పరీక్షను కూాడా రద్దు చేయాలి.. R S Praveen Kumar డిమాండ్
దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవల విద్యుత్ శాఖలో జరిగిన జూనియర్ లైన్ మెన్ పరీక్షలో పేపర్ లీకైందని రద్దు చేశారని, ఆ రోజే జరిగిన ఏఈఈ పరీక్షను కూడా రద్దు చేయాల్సిందేనని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. శుక్రవారం ట్విట్టర్ వేదికగా తెలిపారు. జూనియర్ లైన్ మెన్ పరీక్షలో పేపర్ లీక్ వ్యవహారంపై విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డిపై చర్యలేవని ప్రశ్నించారు. " దళితుడైన డాక్టర్ రాజయ్యకొక న్యాయం - ఆధిపత్య వర్గాలకొక న్యాయమా? " అని ప్రశ్నించారు.
ఇంద్రవెళ్లిలో ఒక పేద, గిరిజన యువతి అనుమానాస్పద మృతిలో ఖానాపూర్ ఎమ్మెల్యే అనుచరుడు శ్రీరాంనాయక్ పాత్ర ఉందని ఆరోపించారు. ఎమ్మెల్యే అనుచరుడి పాత్ర ఉందని వెలుగులోకి తీసుకొచ్చినందుకు బీఎస్పీ నిర్మల్ ఇంచార్జ్ రాథోడ్ బన్సీలాల్ పై కేసీఆర్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయాని, టీఆర్ఎస్ పార్టీలో బందీలైన బహుజనులారా ఒక సారి ఆలోచించండి అంటూ ట్వీట్ చేశారు.
అమెరికా పర్యటనలో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అమెరికాలోని ప్రవాస భారతయులతో గ్లోబల్ ఎన్ఆర్ఐ ఫోరమ్ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ అడవుల్లో జన్మించి 9 సంవత్సరాల వరకు పశువుల కాపరిగా ఉండి కష్టపడి చదువుకుని అమెరికాలో ఆడిQ7 కారుకు ఓనరైన గిరిజన బిడ్డ, భూక్యా ఫూల్ సింగ్ కు అభినందనలు తెలిపారు. కేసీఆర్ మాత్రం పేదపిల్లల చదువులకు అసలే పైసలిస్తలేడని మండిపడ్డారు. బీఎస్పీ పాలనలో ఇంటికొక ఫూల్ సింగ్‌ను తయారుచేసుకుందామని పిలుపునిచ్చారు. ఇల్లినాయిస్ నగరంలో స్ప్రింగ్‌ఫీల్డ్‌లోని అబ్రహం లింకన్ మెమోరియల్ ను ఆర్ఎస్పీ సందర్శించారు. లింకన్ అమెరికాలో బానిసత్వ నిర్మూలన కోసం పనిచేశారాని గుర్తు చేశారు.