- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ. 68.11 కోట్లు 'kick back'! లిక్కర్ స్కామ్ చార్జిషీట్‌లో సీబీఐ
దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును తవ్వినకొద్దీ ట్విస్ట్ లే..ట్విస్టులు! ఎక్సైజ్ పాలసీ అమలుకు ముందే ఇండో స్పిరిట్స్ బ్యాంకు ఖాతాల్లో రూ. 68.11 కోట్లు జమ అయినట్టు సీబీఐ ఆరోపించింది. ఇందులో రూ. 29.29 కోట్లు సంస్థ వ్యాపార భాగస్వామి అరుణ్ రామచంద్రన్ పిళ్లయ్ అకౌంట్‌కు వెళ్లినట్టు స్పష్టం చేసింది. సంస్థలో కేవలం 32.5% మేర(రూ. 3.40 కోట్లు) వాటాలే ఉండగా లాభాల్లో మాత్రం 'కిక్ బ్యాక్' రూపంలో 61% మళ్లించినట్టు తేల్చింది. ఐఎంఎఫ్ఎల్(ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్) ధరల్లో మార్జిన్ 12% ప్రాఫిట్‌గా ఫిక్స్ చేసేలా రూపొందిన పాలసీతోనే సంస్థకు మేలు చేకూరినట్లు పేర్కొంది. లిక్కర్ పాలసీ అమల్లోకి రాకముందే సుమారు రూ. 30 కోట్ల మేర అడ్వాన్సు (అప్ ఫ్రంట్)గా చెల్లించినందున ఎక్కువ లాభం పిళ్లయ్‌కే చెందినట్టు వ్యాఖ్యానించింది. ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టుకు గత నెలలో సీబీఐ సమర్పించిన చార్జిషీట్‌ను స్టడీ చేసి గురువారం ఆమోదం తెలపగా 'కాగ్నిజెన్స్ ఆర్డర్'లో జడ్జి ఎంకే నాగ్‌పాల్ పై విధంగా కామెంట్లు చేశారు.
సౌత్ మీడియా గ్రూపులతో..
అరుణ్ రామచంద్రన్ పిళ్లయ్‌కు వచ్చిన లాభాల్లో రూ. 4.75 కోట్ల మేర ముత్తా గౌతమ్ బ్యాంకు ఖాతాల్లోకి..ఆయన నుంచి రూ. 3.85 కోట్ల మేర బోయిన్‌పల్లి అభిషేక్ ఖాతాకు ట్రాన్సఫర్ అయ్యాయని ఆర్డర్ పేర్కొంది. పిళ్లయ్ అకౌంట్ నుంచి మరికొంత మొత్తం అభిషేక్‌కు, అప్రూవర్ దినేష్ అరోరా ఖాతాల్లోకి కూడా వెళ్లాయని తెలిపింది. ఈ ముగ్గురికీ సౌత్ మీడియా గ్రూపులతో సంబంధాలున్నట్లు వ్యాఖ్యానించింది. పాలసీ తయారీకి ముందే ఎక్సైజ్ శాఖకు చెందిన ఇద్దరు అధికారులు, మరో ఐదుగురి మధ్య సంప్రదింపులు జరిగాయని, 2020 ఏప్రిల్ నుంచే వీరి భాగస్వామ్యం ఉన్నట్లు ఆరోపించింది. నేరపూరిత కుట్రలో భాగంగానే వీరంతా పాలసీ మేకింగ్‌లో పాలుపంచుకున్నట్లు వివరించింది.
హవాలా రూట్‌లో పంపకాలు
పాలసీ అమల్లోకి రాకముందే ఎవరికి ఎలా ప్రయోజనం చేకూరేలా ఉండాలో చర్చలు జరిగాయని, ఆ ప్రకారమే అడ్వాన్సు(అప్‌ప్రంట్)గా నగదు చేతులు మారిందని ఆ ఆర్డర్ కాపీ వివరించింది. గతేడాది జూలై-సెప్టెంబర్ మధ్య హవాలాగా డబ్బులు చేతులు మారాయని తెలిపింది. ముందుగా దక్షిణాదికి చెందిన లిక్కర్ తయారీ కంపెనీల నుంచి ఆప్ పెద్దనేతలతో సన్నిహిత సంబంధాలు కలిగిన విజయ్ నాయర్‌కు చేరాయని పేర్కొంది. కొన్ని లిక్కర్ తయారీ కంపెనీల తరఫున బోయిన్‌పల్లి అభిషేక్ సుమారు రూ. 30 కోట్ల మేర దినేష్ అరోరా ద్వారా విజయ్ నాయర్‌కు చేరవేశారని, ఇందుకు హవాలా మార్గాన్ని ఎంచుకున్నట్లు ఆరోపించింది. పాలసీ ద్వారా లైసెన్సులు పొందిన వైన్ షాపులు (వెండర్లు) లిక్కర్ తయారీ కంపెనీల నియంత్రణలో ఉన్నాయని, ఆ కారణంగానే హోల్‌సేలర్ల ద్వారా క్రెడిట్ నోట్లు జారీ అయినట్లు వివరించింది.
సహకారానికి ప్రతిఫలంగా..
లైసెన్సుల జారీలో లిక్కర్ కంపెనీలు, మధ్యవర్తుల సిఫారసులకు అనుగుణంగా ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా తగిన సహకారం అందించారని, ఇందుకు ప్రతిఫలంగా అసిస్టెంట్ కమిషనర్ నరేంద్రసింగ్‌కు రూ. 30 లక్షల మేర ముడుపులు అందాయని వివరించింది. లైసెన్సుల జారీ క్లియరెన్సు ప్రక్రియలో కిందిస్థాయి సిబ్బందిపైన నరేంద్రసింగ్‌తో పాటు డిప్యూటీ కమిషనర్ కుల్‌దీప్‌సింగ్ కూడా ఒత్తిడి తీసుకొచ్చారని, చివరకు ఒప్పందం ప్రకారమే మొత్తం ప్రాసెస్ జరిగిపోయిందని తెలిపింది. సీబీఐ చార్జిషీట్‌లో ఏడో నిందితుడు సమీర్ మహేంద్రు కేవలం ఇండో స్పిరిట్స్ కంపెనీకి మాత్రమే నిర్వాహకుడు కాదని, పెర్నార్డ్ రికార్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఖావో గాలీ రెస్టారెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలనూ ఆయనే ప్రత్యక్షంగా, పరోక్షంగా కంట్రోల్ చేస్తున్నట్లు ఆరోపించింది.
ఇన్ఫర్మేషన్ రిపోర్టులోనూ..
చార్జిషీట్‌లో ఏడుగురిని మాత్రమే నిందితులుగా పెట్టినా.. విజయ్ నాయర్, బోయిన్‌పల్లి అభిషేక్‌లను మాత్రమే అరెస్టు చేశామని సీబీఐ కేసులో వారికి గత నెల 14న బెయిల్ మంజూరైనా ఇప్పటివరకూ ష్యూరిటీ బాండ్లను సమర్పించలేదని పేర్కొంది. ఈడీ నమోదు చేసిన ఇన్ఫర్మేషన్ రిపోర్టులోనూ వీరిద్దరూ నిందితులుగా ఉన్నారని, కొన్ని రోజుల పాటు వీరిని కస్టడీలోకి తీసుకుని ఈడీ అధికారులు విచారించారని, ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారని తెలిపింది. మరో ఐదుగురు నిందితులను సీబీఐ అరెస్టు చేయకపోయినా వారి నుంచి స్టేట్‌మెంట్లను రికార్డు చేసుకున్నదని, ఆ వివరాలు, ఆధారాల మేరకే కేసు ట్రయల్ ప్రారంభించాలన్న ఉద్దేశంతోనే సీబీఐ చార్జిషీట్ సమర్పించిందని, దానిని నిశితంగా స్టడీ చేసిన తర్వాత ట్రయల్ ప్రారంభించాలని కోర్టు నిర్ణయం తీసుకున్నదని జడ్జి నాగ్‌పాల్ వివరించారు.
ఉత్తర్వుల జారీతో...
సీబీఐ తన చార్జిషీట్‌లో ఏడుగురు మాత్రమే నిందితులుగా పేర్కొన్నప్పటికీ ఎఫ్ఐఆర్‌లో ఎక్యూజ్డ్‌గా ఉన్న డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సహా పలువురిపై విచారణ పెండింగ్‌లో ఉన్నట్లు జడ్జి ఆర్డర్‌లో స్పష్టత ఇచ్చారు. పాలసీలో ఏడుగురు నిందితులు కుట్రకు పాల్పడ్డారనే అభియోగాలతో వారిపై ఐపీసీలోని సెక్షన్120(బీ)తో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7, 7-ఏ, 8 ప్రకారం కేసులు నమోదైనట్లు తెలిపారు. ఏడుగురు నిందితులనూ జనవరి 3న కోర్టులో హాజరుకావాల్సిందిగా జడ్జి నాగ్‌పాల్ ఉత్తర్వులు జారీచేయడంతో ట్రయల్ లాంచనంగా ప్రారంభం కానుంది.
Also Read...
సార్.. ఎక్కడికెళ్లినా ఇదే అడుగుతున్నారు... ఏం జేయమంటర్ సార్?