కర్నాటకలో కాంగ్రెస్ గెలవకుండా కేసీఆర్ కుట్ర: TPCC చీఫ్ రేవంత్ రెడ్డి

by Satheesh |   ( Updated:2023-01-18 13:30:25.0  )
TPCC Chief Revanth Reddy Slams CM KCR and PM Modi Over Floods assistance
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో కర్నాటకలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకుండా సీఎం కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇందుకోసం కర్నాటకకు చెందిన 25 మంది కాంగ్రెస్ నేతలో సీఎం కేసీఆర్ మాట్లాడారని.. వారికి రూ. 500 కోట్ల ఆఫర్ ఇచ్చారని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆ నేతలను కేసీఆర్ తన ఫామ్ హౌస్‌కు పిలిచి మాట్లాడారని అన్నారు. సునీల్ కనుగోలు సర్వే రిపోర్ట్‌ను దొంగలించి కేసీఆర్ ఈ పని చేస్తున్నాడని ఆరోపణలు గుప్పించారు.

Advertisement

Next Story