భాగ్యలక్ష్మీ అమ్మవారి సమక్షంలో బండి సంజయ్‌కి MLA Rohit Reddy సవాల్

by Sathputhe Rajesh |   ( Updated:2022-12-17 08:55:06.0  )
భాగ్యలక్ష్మీ అమ్మవారి సమక్షంలో బండి సంజయ్‌కి MLA Rohit Reddy  సవాల్
X

దిశ, చార్మినార్​ : మొయినాబాద్​ఫాంహౌజ్​కేసులో కీలకంగా ఉండడంతో పాటు ఈడీ నోటీసులు అందుకున్న నేపథ్యంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్​రెడ్డి శనివారం చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలట్​రోహిత్​ రెడ్డి బండి సంజయ్‌కు సవాల్ విసిరారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తనకు కర్ణాటకలో డ్రగ్స్ కేసులో సంబంధముందని, రెండు సంవత్సరాల క్రితం కర్ణాటక పోలీసుల నుంచి నోటీసులు అందాయని తెలిపారు. తనను విచారణ చేశారని, తన పేరు‌పై ఎఫ్ఐఆర్​నమోదయ్యిందని బండి సంజయ్ ఆరోపణలు చేసిన నేపధ్యంలో​చార్మినార్​ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించారు. బండి సంజయ్‌కు సవాల్ విసిరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలట్​ రోహిత్​రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రను భయటపెట్టినందుకే కక్ష్యసాధింపులో భాగంగానే నన్ను టార్గెట్ చేస్తూ ఈడీ నోటీసులు పంపించారన్నారు. దేశ ప్రజల ముందు బీజేపీ చేసిన కుట్రను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భగ్నం చేశారని గుర్తు చేశారు. అది ఓర్చుకోలేక మమ్మల్ని టార్గెట్​చేస్తున్నారన్నారు. తనకు ఈడీ నోటీసులు వస్తున్నాయని బండిసంజయ్​ చెప్పడం.. ఆయన చెప్పిన విధంగానే ఈడీ నోటీసులు రావడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐలను బీజేపీ వారి త్రిముఖ దళాలుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. దేశం, తెలంగాణలో అసలు ఏమి జరుగుతుందని ? ప్రజలందరు గమనిస్తూనే ఉన్నారన్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థను బీజేపీ భ్రష్టుపట్టిస్తోందని ధ్వజమెత్తారు.బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌కి తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సవాల్ విసిరారు. శనివారం భాగ్యలక్ష్మీ ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఉ అంటే భాగ్యలక్ష్మి ఆలయం అంటారు కదా అందుకే ఇక్కడికి వచ్చానని బండి సంజయ్‌కి దమ్ముంటే రేపు భాగ్యలక్ష్మి ఆలయానికి రావాలని కర్ణాటక కేసుపై ప్రమాణం చేద్దామన్నారు. రేపు భాగ్యలక్ష్మీ టెంపుల్ కి రాకుంటే తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈడీ నోటీసులపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. తప్పుడు ఆరోపణలు చేయడం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు. ఈడీ సీబీఐ దాడులకు భయపడబోమన్నారు. బీఅర్‌ఎస్‌ను చూసి బీజేపీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. ఈడీ నోటీసులు చూసి లాయర్లే ఆశ్చర్యపోతున్నారన్నారు. ఈడీ నోటీసుల్లో నా వ్యతిగత బయోడేటా మాత్రమే అడిగారని తెలిపారు. నా బయోడేటా పబ్లిక్ డొమైన్‌లో దొరుకుతుందని దానికి నోటీసులు ఇవ్వాలా? అని ప్రశ్నించారు. బండి సంజయ్‌కి దమ్ముంటే నా సవాల్‌ని స్వీకరించాలన్నారు. రేపు ఉదయం 10 గంటలకు చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి రావాలన్నారు. న్యాయస్థానాల‌పై మాకు నమ్మకం ఉందన్నారు. తెలంగాణ కోసం అనుక్షణం పోరాటం చేసి సాధించిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

Also Read...

బట్టి నివాసంలో టీ కాంగ్రెస్ అసంతృప్త నేతల కీలక భేటీ

Advertisement

Next Story

Most Viewed