- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పటేల్ రమేష్ రెడ్డి ఇంటికి చేరుకున్న రోహిత్ చౌదరి, మల్లు రవి.. తీవ్ర ఉద్రిక్తత
దిశ, నల్లగొండ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు అభ్యర్థిగా సూర్యపేట నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేసిన పటేల్ రమేష్ రెడ్డిని బుజ్జగించేందుకు ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి మల్లు రవిలు ఆయన నివాసానికి చేరుకున్నారు. అప్పటికే స్థానికంగా ఉన్న కార్యకర్తలు వారిని ఇంట్లోకి రాకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత రమేష్ రెడ్డి సూచన మేరకు శాంతించిన కార్యకర్తలు ఇంట్లోకి వెళ్లనిచ్చారు. ఇంట్లోనే చర్చలు జరుగుతున్న క్రమంలో బయట ఉన్న కార్యకర్తలు ఓపిక నశించి రమేష్ రెడ్డి ఇంటి కిటికీ అద్దాలు రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ పరిస్థితుల్లో నామినేషన్ ఉపసంహరించుకోవద్దని ఒకవేళ అదే జరిగితే సూర్యాపేటలో తిరిగే పరిస్థితి లేదని కార్యకర్తలు ఏకంగా రమేష్ రెడ్డికి చెబుతున్నట్లు తెలుస్తోంది.
బుజ్జగించేందుకు వచ్చిన నాయకులు బయటికి వెళితే వాళ్లపై దాడి చేసేందుకు కూడా కార్యకర్తలు వెనుదిరిగని పరిస్థితి ఉంది. ఇలా ఉంటే బుజ్జగింపులు చర్చల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓ వైపు చర్చలు కొనసాగుతూ ఉండగా పటేల్ రమేష్ రెడ్డి సతీమణి లావణ్య మీడియాతో మాట్లాడుతూ సర్వే నివేదికలన్నీ పటేల్ రమేష్ రెడ్డికి అనుకూలంగా ఉండగా దామోదర్ రెడ్డికి టికెట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తమకు అన్యాయం జరగడానికి మొత్తం కారణం ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అని, రూ.30 కోట్లు తీసుకుని టికెట్ ఇప్పించారని ఆరోపించారు.