Farmers Protest : రైతులను అందుకు ఒప్పించండి.. హై పవర్ కమిటీకి సుప్రీంకోర్టు కీలక సూచనలు

by Hajipasha |
Farmers Protest : రైతులను అందుకు ఒప్పించండి.. హై పవర్ కమిటీకి సుప్రీంకోర్టు కీలక సూచనలు
X

దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ బార్డర్‌లో నిరసన తెలుపుతున్న రైతులతో చర్చలు జరిపేందుకు తాము ఏర్పాటుచేసిన హై పవర్ కమిటీకి సుప్రీంకోర్టు(Supreme Court) కీలక సూచనలు చేసింది. గాంధేయ సిద్ధాంతాలతో నిరసన తెలపాలని రైతులకు(Farmers Protest) చెప్పాలని కమిటీకి నిర్దేశించింది. నిరసనలను ఆపడమో లేదంటే హైవేలకు దూరంగా జరగడమో ఏదో ఒకటి తేల్చుకోవాలని రైతులకు సూచించాలని హైపవర్ కమిటీని దేశ సర్వోన్నత న్యాయస్థానం కోరింది.

ఏదోలా రైతులను ఈ అంశాలపై ఒప్పించాలని సూచించింది. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పంజాబ్ రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ ఆరోగ్యం క్షీణిస్తుండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆయన దీక్షను విరమింపజేసేందుకు బలప్రయోగం చేయకూడదని తెలిపింది. జగ్జీత్ సింగ్ దల్లేవాల్ ప్రాణాలను నిలిపేందుకు ఏదైనా చర్యను చేపడితే తప్పేమీ కాదని సుప్రీంకోర్టు పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed