Allu Arjun : బన్నీ కోసం ప్రత్యేక బ్యారక్ సిద్ధం చేసిన జైలు సిబ్బంది

by M.Rajitha |
Allu Arjun : బన్నీ కోసం ప్రత్యేక బ్యారక్ సిద్ధం చేసిన జైలు సిబ్బంది
X

దిశ, వెబ్ డెస్క్ : అల్లు అర్జున్(Allu Arjun) కు హైకోర్ట్(High Court) బెయిల్ మంజూరు చేసినప్పటికీ విడుదలకు మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బన్నీ న్యాయవాదులు పూచీకత్తు బాండ్లు తీసుకొని చంచల్ గూడ జైలు(Chanchalguda Jail)కు చేరుకున్నప్పటికీ.. విడుదల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. దీంతో బన్నీ ఈ రాత్రికి జైళ్లోనే ఉండనున్నట్టు సమాచారం. ఆయన కోసం జైలు సిబ్బంది ప్రత్యేక బ్యారక్ ను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే విడుదల ప్రక్రియ ఆలస్యంపై అసహనం వ్యక్తం చేసిన అల్లు అరవింద్(Allu Aravind), అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయారు.

కాగా సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద పుష్ప-2 ప్రీమియిర్ షో(Pushpa-2 Premior Show) సందర్భంగా జరిగిన తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్‌ ను నేడు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌ (Chikkadpally Police Station)లో స్టేట్మెంట్ రికార్డ్ చేసి, గాంధీ ఆసుపత్రి(Gandhi Hospital)లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం.. నాంపల్లి కోర్టు (Nampally Court)లో హాజరుపరిచారు. కోర్ట్ బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించగా.. చంచల్ గూడ జైలుకు తరలించారు. మరోవైపు చిక్కడపల్లి పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లు కొట్టి వేయాలని హైకోర్టు(High Court)లో బన్నీ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ పై విచారణ చేపట్టిన కోర్ట్.. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు అల్లు అర్జున్ కు వర్తించవని, మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే అప్పటికే బన్నీని పోలీసులు జైలుకు తరలించగా.. విడుదల ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. ఈ రాత్రికి జైలులోనే ఉండనున్న అర్జున్.. రేపు ఉదయం విడుదల అవనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed