సిట్ విచారణకు ముందు రేవంత్ సంచలన ట్వీట్

by Satheesh |   ( Updated:2023-03-23 08:28:18.0  )
సిట్ విచారణకు ముందు రేవంత్ సంచలన ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వ తీరుపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో గురువారం సిట్ విచారణకు హాజరయ్యేందుకు ముందు ట్వీట్ చేసిన ఆయన.. పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతల హౌస్ అరెస్టులపై మండిపడ్డారు. తమ నేతల నిర్భంధాన్ని ఖండించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను విచారణకు పిలిచారని ఈడీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ హై డ్రామా చేసిందని ఇప్పుడేమో ఇదే సీఎం ప్రతిపక్షాల నిరసనలను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని ఇదెక్కడి న్యాయం అని ధ్వజమెత్తారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ పై తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని వాటిని సిట్ కు అందజేసిన తర్వాత మాట్లాడుతానన్నారు.

Read More: సిట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. కారు దిగి కాలినడకన వెళ్లిన రేవంత్ రెడ్డి

Advertisement

Next Story