‘ఎవరైనా నో ప్రాబ్లమ్’.. TPCC చీఫ్ పోస్ట్‌పై సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Satheesh |
‘ఎవరైనా నో ప్రాబ్లమ్’.. TPCC చీఫ్ పోస్ట్‌పై సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌గా రేవంత్ రెడ్డి పదవి కాలంతో నేటితో ముగియనుంది. ఈ క్రమంలో టీపీసీసీ నూతన చీఫ్ ఎన్నికకు ఏఐసీసీ కసరత్తు స్టార్ట్ చేసింది. ఈ మేరకు టీ-కాంగ్రెస్ ముఖ్య నేతలతో ఏఐసీపీ ఇవాళ భేటీ కానుంది. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ పదవిపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ అక్కడ మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నా పీసీసీ అధ్యక్ష పదవీకాలం ముగిసింది.. అధ్యక్షుడిగా పార్టీ అధిష్టానం ఎవరిని నియమించినా వారితో కలిసి పనిచేస్తానని స్పష్టం చేశారు.

టీపీసీసీ అధ్యక్షుడి నియామకంపై నాకంటూ ప్రత్యేక ఛాయిస్ ఏది లేదని క్లారిటీ ఇచ్చారు. అధిష్టానం ఎవరిని నియమించినా వారితో కలిసి పనిచేయడమే నా బాధ్యత అని రేవంత్ తేల్చి చెప్పారు. నా పదవి కాలంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో గతానికంటే మంచి పనితీరు కనబరిచామని అన్నారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ పదవి కాలం ముగియడంతో నెక్ట్స్ తెలంగాణ కాంగ్రెస్ బాస్ ఎవరు అవుతారని స్టేట్ పాలిటిక్స్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Next Story