- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మీ దాకా వస్తే కానీ నొప్పి తెలియలేదా..?’ KCR వ్యాఖ్యలకు CM రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్
దిశ, వెబ్‌డెస్క్: పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం సొంత జిల్లా మహబూబ్ నగర్‌లో పర్యటించిన రేవంత్.. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, ప్రాజెక్టులపై అధికారులతో రివ్యూ నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ మారుతున్నారని కేసీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, మరీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో ఎంతో మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ తన పార్టీలో చేర్చుకోలేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ రాజనీతి అప్పుడు ఎక్కడ పోయిందని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజులకే కూలిపోతుందని ఆయన అనలేదా..?, తనదాకా వస్తే కానీ కేసీఆర్‌కు ఆ బాధ తెలియలేదా అని సెటైర్ వేశారు. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్, బీజేపీ కుట్ర చేశాయని.. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఆ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పడిపోవాలని కొందరు నేతలు ఇంకా విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాగా, ఏడుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సాహిస్తోందని కేసీఆర్ అధికార పార్టీని విమర్శిస్తున్నారు. దీంతో తాజాగా కేసీఆర్ కామెంట్స్‌కు రేవంత్ రెడ్డి పై విధంగా కౌంటర్ ఇచ్చారు.