- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిల్లర గొడవలకు ఫుల్‌స్టాప్ పెట్టండి.. నిర్మలా సీతారామన్‌కు రేవంత్ లేఖ
దిశ, తెలంగాణ బ్యూరో: చిల్లర గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సూచించారు. వీధినాటకాలు ఆపి ప్రజా సమస్యలు, విభజన హామీలపై దృష్టి పెట్టాలన్నారు. శనివారం కేంద్ర ఆర్థిక మంత్రికి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రెండు రోజులుగా రాష్ట్రంలో మీరు ప్రవర్తిస్తున్న తీరు.. దానికి ప్రతిగా రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు మంత్రులు ప్రతిస్పందిస్తున్న విధానం అభ్యంతరకరంగా ఉందని వెల్లడించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి ఇలా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. ఎనిమిదేండ్లుగా తెలంగాణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేశాయన్నారు. విభజన చట్టంలోని హామీల అమలు పై ఏ నాడు దృష్టిపెట్టని మీరు రేషన్ షాపుల్లో ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి ఫోటోల పంచాయితీని పతాక స్థాయికి తీసుకువెళ్లడం కేంద్రమంత్రి స్థాయికి తగదని అభిప్రాయపడ్డారు.