టీచర్ ఎమ్మెల్సీ ఓటర్లకు రేవంత్ రెడ్డి కీలక విజ్ఞప్తి

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-09 07:21:38.0  )
టీచర్ ఎమ్మెల్సీ ఓటర్లకు రేవంత్ రెడ్డి కీలక విజ్ఞప్తి
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీచర్ ఎమ్మెల్సీ ఓటర్లకు రేవంత్ రెడ్డి కీలక విజ్ఞప్తి చేశారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జి.హర్షవర్ధన్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఓటర్లకు బహిరంగ లేఖను రాశారు. హాథ్ సే హాథ్ జోడో పాదయాత్ర కారణంగా నేరుగా మిమ్మల్ని కలవలేకపోతున్నానని అన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పట్ల పోరాడే హర్షవర్ధన్ రెడ్డిని గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉపాధ్యాయులను మోసం చేస్తోందని ధ్వజమెత్తిన రేవంత్ రెడ్డి.. డీఏలు, జీతాలు, పెన్షన్ల విషయంలో ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. కాగా ఈ స్థానానికి మార్చి 13న పోలింగ్ జరగబోతోంది.

ఇవి కూడా చదవండి : తెలంగాణకు కాదు.. కవితకే అవమానం : భట్టి విక్రమార్క

Next Story

Most Viewed