- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Revanth Reddy: ఆ జర్నలిస్ట్ పాపం తగిలే కవిత జైలుకు.. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య చర్చ వాడీవేడీగా సాగుతున్నది. సోమవారం విద్యుత్ అంశంలో జరిగిన డిబేట్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు చుట్టాలైపోయారని ధ్వజమెత్తారు. బావ బావమరుదులు చీకట్లో ఢిల్లీకి వెళ్లి కాళ్లు పట్టుకోగానే వీళ్లంతా చుట్టపోళ్లు అయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వంతో ఎన్టీపీసీ నుంచి 2,400 మెగావాట్ల విద్యుత్ ఇతర రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి ఉందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ సభ్యులు సభలో ప్రస్తావించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి పై వ్యాఖ్యలు చేశారు. ఎన్టీపీసీకి 4,000 మెగావాట్లకు కాంగ్రెస్ కు అనుమతులు ఇస్తే 1600 మెగావాట్ల ఉత్పత్తికే బీఆర్ఎస్ అనుమతి ఇచ్చింది. 2,400 ఉత్పత్తికి పదేళ్లు అనుమతి ఇవ్వలేదు. ఎన్టీపీసీ ఉత్పత్తి చేస్తే తమ సొంత కాంట్రాక్టర్లు, బినామీలకు ఇచ్చుకోవడానికి వీలు ఉండదని ఎన్డీపీసీని నియంత్రించారు. కానీ మా ప్రభుత్వం వచ్చాక ఎన్టీపీసీని పిలిపించి 2,400 మెగావాట్ల ప్రాజెక్టును ప్రారంభించాలని అగ్రిమెంట్లు చేసి ముందుకు తీసుకువెళ్తున్నదే తామే. వీటికి రికార్డులు ఉన్నాయి.
కవిత జైలుకు వెళ్లింది అందుకే..
యూపీఏ ప్రభుత్వంలో ఉన్నా రాష్ట్ర సాధన కోసం పార్లమెంట్ లో గళం విప్పింది మా సభ్యులు అయితే మంత్రిపదవుల కోసం పెదవులు మూసుకుని చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి దగ్గర ఊడిగం చేసింది మీ బీఆర్ఎస్ నాయకులు కాదా? మీరా మా చిత్తుశుద్ధిని ప్రశ్నించేది అని సీఎం సభలో నిలదీశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీలో నేను నిటారుగా నిలబడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మాట్లాడినంత సేపు పార్లమెంట్ లో కేసీఆర్ కనీసం నోరైనా తెరవలేదని ధ్వజమెత్తారు. ఎవరో త్యాగాలు చేస్తే, ఎవరో ఆత్మబలిదానాలు చేస్తే వాటి పునాధుల మీద అధికారంలోకి వచ్చి మమ్మల్ని తప్పుబడుతారా అని మండిపడ్డారు. గతంలో మీ మాట వింటలేదని ఓ మహిళా జర్నలిస్టును జైలు పాలు చేశారని ఆ పాపం వల్లే ఇవాళ మీ ఇంట్లో జైలుకు పోతున్నారని కవిత అరెస్టు పై పోరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.