- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అరెస్టులతో కాంగ్రెస్ నాయకులను అడ్డుకోలేరు: రేవంత్ రెడ్డి ఆగ్రహం
దిశ, వెబ్‌డెస్క్: అరెస్టులు చేసి కాంగ్రెస్ నాయకులను అడ్డుకోలేరని పోలీసులపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు వరంగల్ నగరం అల్లకల్లోలం అయ్యిందని.. ఒక్క పైసా నష్టపరిహారం గాని, నష్ట నివారణ కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టలేదని కాంగ్రెస్ సోమవారం గ్రేటర్ వరంగల్ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన పోలీసులు జీడబ్ల్యూఎంసీ వద్ద నిరసన చేసిన కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.
దీంతో వరంగల్ కాంగ్రెస్ నాయకుల అక్రమ అరెస్టుల పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుల అక్రమ అరెస్ట్‌లను ఆయన ఖండించారు. అరెస్ట్ చేసిన నాయకులను వెంటనే విడుదల చేసి వారితో కార్పోరేషన్ అధికారులు మాట్లాడాలని డిమాండ్ చేశారు. అరెస్టులతో ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి హెచ్చరించారు.