- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: 12 మంది BRS ఎమ్మెల్యేలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన Revanth Reddy
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలపై టీ- కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, మహేష్ గౌడ్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌కు పాలనపై దృష్టి లేదని.. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడమే ఆయన పని అని మండిపడ్డారు. ఫిరాయింపులతోనే కేసీఆర్ పార్టీని పెంచుకున్నారని ఆరోపించారు. వార్డ్ మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ల వరకు.. కేసీఆర్ అందరిని ప్రలోభ పెట్టారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్లిన 12 మంది బ్యాంక్ ఖాతాల వివరాలతో పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. బీఆర్ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలు ఆర్థిక ప్రయోజనాలు పొందారని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపుదారులపై సీబీఐ విచారణ జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలపై డీజీపీ, ఈడీ, సీబీఐ, ఏసీబీకి ఫిర్యాదు చేస్తామని.. అవసరమైతే కోర్టుకు వెళ్తామని.. న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.