- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్ రెడ్డి మాడు పగలడం ఖాయం : KTR
దిశ, తెలంగాణ బ్యూరో : బుధవారం ట్విట్టర్లో కాంగ్రెస్ పార్టీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ నోట.. రైతులకు రెండో ప్రమాద హెచ్చరిక.. ! నోట్లు తప్ప... రైతుల పాట్లు తెల్వని రాబందును నమ్మితే రైతు నోట్లో మట్టికొట్టుడు ఖాయం.. అన్నదాత నిండా మునుగుడు పక్కా అని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ వస్తే నిన్న ధరణి తీసేస్తం అన్నడు రాబందు, నేడు 3 గంటల కరెంట్ చాలు అంటున్నడు.. నాడు వ్యవసాయం దండగ అన్నడు చంద్రబాబు
నేడు మూడుపూటలు దండగ అంటున్నడు ఛోటా చంద్రబాబు అని మండిపడ్డారు. మూడు ఎకరాల రైతుకు.. మూడుపూటలా కరెంట్ ఎందుకు అనడం..ముమ్మాటికీ సన్న, చిన్నకారు రైతును అవమానించడమే అన్నారు. కాంగ్రెస్‌కు ఎప్పుడూ.. చిన్నకారు రైతు అంటే చిన్నచూపు, సన్నకారు రైతు అంటే సవతిప్రేమ అని ధ్వజం ఎత్తారు. నాడు.. ఏడు గంటలు ఇవ్వకుండా ఎగ్గొట్టిన కాంగ్రెస్, నేడు.. ఉచిత కరెంట్‌కు ఎగనామం పెట్టే కుట్ర చేస్తోందని, మూడుగంటలతో 3 ఎకరాల పొలం పారించాలంటే బక్కచిక్కిన రైతు బాహుబలి మోటార్లు పెట్టాలి అన్నారు.
అరికాలిలో మెదడు ఉన్నోళ్లను నమ్ముకుంటే రైతుల బతుకు ఆగం...అని, మళ్లోసారి రాబందు 3 గంటల మాటెత్తితే.. రైతుల చేతిలో మాడు పగలడం ఖాయంఅన్నారు. తెలంగాణ రైతన్నలకు ఇది పరీక్షా సమయం అని, రైతును రాజును చేసే మనసున్న ముఖ్యమంత్రి KCR కావాలా ? 3 గంటలు చాలన్న మోసకారి రాబందు కావాలా ? ఆలోచన చేయాలన్నారు.
Also Read..
కేంద్రంలో చక్రం తిప్పేలా కేసీఆర్ ప్లాన్! ఈసారి గెలిస్తే కేటీఆరే సీఎం?