సికింద్రాబాద్ ఘటనపై రేవంత్ రెడ్డి సీరియస్.. "వారి మృతికి ప్రభుత్వమే కారణం"

by Mahesh |   ( Updated:2022-09-13 05:30:30.0  )
సికింద్రాబాద్ ఘటనపై రేవంత్ రెడ్డి సీరియస్.. వారి మృతికి ప్రభుత్వమే కారణం
X

దిశ, డైనమిక్ బ్యూరో: సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంలో ఏడుగురు మృతి చెందిన ఘటన పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏడుగురు దుర్మరణం పాలయ్యారాలని ఆరోపించారు. గతంలో హైదరాబాద్‌‌లో అనేక అగ్ని ప్రమాదాలు జరిగి ప్రజల ప్రాణాలు బలి అవుతున్నా.. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్షమే ఇంతటి విపత్తులకు కారణమన్నారు. ఇటువంటి మహానగరంలో ప్రభుత్వం నియమ నిబంధనలు కఠినంగా అమలు చేయకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలకు ఆస్కారం ఇస్తుందన్నారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో ఇదే సికింద్రాబాద్‌లోని ఇనుము తుక్కు గోడౌన్లో కూడా ఇలాంటి ప్రమాదం జరిగి ప్రజల ప్రాణాలు పోయాయని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రభుత్వం వెంటనే ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పకడ్బందీ ప్రణాళికలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాగా, ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించవారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ.. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Also Read : సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవ దహనం


Advertisement

Next Story