- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ ఖేల్ ఖతం.. బీఆర్ఎస్ దుఖాన్ బంద్: కేటీఆర్‌కు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్
దిశ, డైనమిక్ బ్యూరో: యావత్ తెలంగాణ గుండె చప్పుడు ఒక్కటే నని, “కేసీఆర్ ఖేల్ ఖతం - బీఆర్ఎస్ దుఖాన్ బంద్” అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు. ఇటీవల కాంగ్రెస్ ప్రవేశపెట్టిన డిక్లరేషన్‌పై కేటీఆర్ ‘అది డిక్లరేషన్ సభ కాదు, అధికారం రానే రాదనే కాంగ్రెస్ ఫ్రస్ట్రేషన్ సభ’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తూ రేవంత్ రెడ్డి కౌంటర్ ట్వీట్ పోస్ట్ చేశారు. ‘మా డిక్లరేషన్.. ఎస్సీ, ఎస్టీ జీవితాలలో గుణాత్మక మార్పునకు కన్ఫర్మేషన్, దళితుడ్ని సీఎం చేస్తానని మోసం చేయడం లాంటిది కాదు, ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేయడం లాంటిది కాదు, గిరిజన రిజర్వేషన్లు 12 శాతం చొప్పున పెంచుతానని మోసం చేయడం లాంటిది కాదు. మద్దతు ధర అడిగిన గిరిజన రైతులను బందిపోట్ల కంటే ఘోరంగా బేడీలు వేసి అవమానించడం లాంటిది కాదు.
నేరెళ్ళ ఇసుక దోపిడీని ప్రశ్నించిన దళిత - బీసీ బిడ్డలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం లాంటిది కాదు. దళిత - గిరిజనులకు కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన అసైన్డ్ భూములను లాక్కుని రియల్ ఎస్టేట్ మాఫియాకు అమ్ముకోవడం లాంటిది కాదు. దళిత మహిళ మరియమ్మను లాకప్ డెత్ చేయించడం లాంటిది కాదు. ఒకే కుటుంబంలో ముగ్గురు మంత్రి పదవులు తీసుకుని ఒక్క మాదిగకు కూడా మంత్రి పదవి ఇవ్వకపోవడం లాంటిది కాదు. ఏబీసీడీ వర్గీకరణ చేయకుండా మోసం చేయడం లాంటిది కాదు. దళిత బంధు పథకంలో 30 శాతం కమీషన్లకు కక్కుర్తిపడే రాబందుల లాంటిది కాదు’ తమ డిక్లరేషన్ అంటూ మంత్రికి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.