- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిమాక్ ఉన్నోడు ఎవడైనా ఆ పని చేస్తడా..? బీఆర్ఎస్‌కు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్
దిశ, డైనమిక్ బ్యూరో: కేసీఆర్ మతిలేకుండా మాట్లాడుతున్నారని.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు, ఆపేస్తామని అబద్దాలు మాట్లాడుతున్నాడని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. సోమవారం కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్, మద్దూర్ రోడ్ షోలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. దిమాక్ ఉన్నోడెవడైనా రైతుబంధు ఆపేస్తాడా అని ప్రశ్నించాడు. తాము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీమ్‌లను అమలు చేస్తామన్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగాలు వచ్చాయి. ఈ పదేళ్లలో యువతకు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ప్రతీ నెల ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మొదటి తారీఖుననే వారి ఖాతాల్లో రూ.2500 జమ చేస్తామని, రూ. 500 కే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా ద్వారా ఎకరాకు రూ.15 వేలు అందజేస్తామన్నారు. ఆడబిడ్డ పెళ్లి జరిగితే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం కూడా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందన్నారు. 200 యూనిట్ల వరకు ఇంటికి ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని ఆశపెట్టి నిండా ముంచాడు. ఇందిరమ్మ రాజ్యంలోనే సంక్షేమ ఫలాలు అందాయన్నారు
నేను వేసిన రోడ్లే ఇప్పటికీ:
గతంలో దౌల్తాబాద్‌లో నేను వేసిన రోడ్లే ఉన్నాయని పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. బీఆర్ఎస్ గెలిచాక ఇక్కడ ఇసుక దందా పెరిగిందని ఆరోపించారు. కొడంగల్ నియోజకవర్గానికి రెండేళ్లలో కృష్ణా జలాలు తెచ్చి లక్షన్నర ఎకరాలకు సాగునీరు ఇస్తామని చెప్పిన కేసీఆర్.. ఈ ఐదేళ్లలో కొడంగల్ నియోజకవర్గానికి కృష్ణా జలాలు తెచ్చారా? కొడంగల్, మద్దూరుకు రైల్వే లైన్లు తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు నీళ్లు తేలేదు కానీ బెల్ట్ షాపులు తెచ్చారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మద్దూర్‌లో 100 పడకల ఆసుపత్రి, స్టేడియం కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఇన్నాళ్లు ప్రజలను నమ్మించి శఠగోపం పెట్టిన కేసీఆర్ మూడోసారి వచ్చి ఓట్లు అడుగుతున్నాడని ఎవరూ నమ్మొద్దన్నారు.