- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిన్న సిట్టింగ్ మేయర్.. నేడు మాజీ మేయర్.. రేవంత్ రెడ్డి పక్కా స్కెచ్!
దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాలు నమోదు అవుతున్నాయి. పలువురు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఇప్పటికే పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరుతున్న తరుణంలో తాజాగా జీహెచ్ఎంసీ మాజీ మేయర్, ఉద్యమకారుడు బొంతు రామ్మోహన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆదివారం సీఎం నివాసానికి వచ్చిన బొంతు మర్యాదపూర్వకంగా కలిశారు. కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరు ఉన్న బొంతు రామ్మోహన్.. గత కొంత కాలంగా బీఆర్ఎస్ పై అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కారు దిగి కాంగ్రెస్ లో చేరబోతున్నారనే ఊహాగానాలు జోరందకుకున్నాయి. ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తూ ఇవాళ సీఎం నివాసంలో ప్రత్యక్షం కావడంతో ఆయన కండువా మార్చడం లాంఛనమే అనే టాక్ వినిపిస్తోంది. అయితే మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్న బొంతు రామ్మోహన్ ఒక వేళ పార్టీ మారితే తనతో పాటు పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లను సైతం తీసుకువెళ్లబోతున్నారనే టాక్ గుప్పుమంటోంది.
కేసీఆర్ కు దెబ్బమీద దెబ్బ:
రాష్ట్రంలో అధికారం కోల్పోయిన కేసీఆర్ కు ఇటీవల వరుసగా దెబ్బమీద దెబ్బ తగులుతున్నాయి. అధికారంలో ఉండగా అంతా తామే అన్నట్లుగా పార్టీలో వ్యవహారాలు చక్కదిద్దిన కేసీఆర్, కేటీఆర్ లకు తాజాగా షాక్ ల మీద షాకులు తగులుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు కేటీఆర్ సన్నిహితుడు, జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఇటీవలే కాంగ్రెస్ గూటికి చేరగా ఈ క్రమంలో కేటీఆర్ కు అత్యంత కీలక అనుచరుడిగా పేరున్న బొంతురామ్మోహన్ సైతం కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధం అయిపోవడం గులాబీ పార్టీలో చర్చనీయాశం అయింది. తెలంగాణ ఏర్పడ్డాక జీహెచ్ఎంసీకి తొలి మేయర్ గా బొంతురామ్మోహన్ పని చేశారు. అయితే ఉప్పల్ నియోజకవర్గం నుంచి గత రెండు పర్యాయాలు ఎమ్మెల్యే టికెట్ ఆశించిన బొంతురామ్మోహన్ కు నిరాశ ఎదురైంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన రేవంత్ రెడ్డిని కలవడం హాట్ టాపిక్ గా మారింది.
నెక్స్ట్ ఎవరు?:
ఇటీవల ప్రస్తుత సిట్టింగ్ జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి సైతం సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మా బ్లడ్ లోనే ఉందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని ఆమె పైకి ఖండించినా ఊహాగానాలు మాత్రం ఆగలేదు. ఈ క్రమంలోనే తాజాగా బొంతురామ్మోహన్ సీఎం వద్దకు వెళ్లడంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరుగుతున్న తాజా పరిణామాలు బీఆర్ఎస్ లో కలకలంగా మారాయి. ఈ పరిణామాలన్ని సీఎం రేవంత్ రెడ్డి పక్కా వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తున్నారనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఓ వైపు బీఆర్ఎస్ నేతలు తనను కలిసేందుకు సంకోచం వద్దని చెప్పడం ద్వారా బీఆర్ఎస్ నేతలకు డోర్లు ఓపెన్ ఉన్నాయనే హింట్ ఇస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే మేయర్, మాజీ మేయర్ ల ఈ మర్యాద పూర్వక భేటీల వెనుక ఆంతర్యం ఏంటనేది సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతం బొంతురామ్మోహన్ సతీమణి జీహెచ్ఎంసీ కార్పొరేటర్లుగా ఉన్నారు. వీరు పార్టీ మారాలని భావిస్తే ఈ దంపతులు మాత్రమే పార్టీని వీడుతారా లేక పార్టీలో ఉన్న పరిచయాల కారణంగా మరి కొంత మంది కార్పొరేటర్లను వెంటతీసుకు వెళ్తారా అనేది సస్పెన్స్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతటా బీఆర్ఎస్ కు ఎదురు గాలి తగిలినా జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం సానుకూల పవనాలే వీచాయి. కానీ ఫలితాలు వచ్చిన రెండు నెలలకో ఈ పరిస్థితులు తారుమారు అవుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని ముఖ్యనేతలంతా ఒక్కొక్కరుగా సీఎం వద్దకు క్యూ కడుతుండటంతో నెక్స్ట్ ఎవరూ అనేది ఉత్కంఠ రేపుతున్నది.