- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Revanth Reddy: గుండె కరిగిపోయే దృశ్యాలు.. ఖమ్మం పర్యటనపై సీఎం భావోద్వేగ ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో: వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడి పరిస్థితులపై ఆసక్తికర ట్వీట్ చేశారు. పర్యటనకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ.. భావోద్వేగబరిత వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా.. గుండె కరిగిపోయే దృశ్యాలు.. మనసు చెదిరిపోయే కష్టాలు స్వయంగా చూశానని తెలిపారు. బాధితుల మొఖాలలో ఒకవైపు తీరని ఆవేదన, మరోవైపు “అన్నా” వచ్చాడన్న భరోసా కనిపించాయని అన్నారు. వీళ్ల కష్టం తీర్చడానికి, కన్నీళ్లు తుడవడానికి, ఎంతటి సాయమైనా చేయడానికి సర్కారు సిద్ధంగా ఉందని ఎక్స్ ద్వారా హామీ ఇచ్చారు.
కాగా రెండు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. సూర్యాపేట, ఖమ్మం, మహాబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి పలు ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా ఖమ్మంలో మున్నేరు వాగు పొంగి పొర్లడంతో చాలా కాలనీలు నీటిలో చిక్కుకుపోయాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వరద పరిస్థితులను పర్యవేక్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రుల బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకొని వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు.