ఇది మోడీ కుటిల నీతికి నిదర్శనం: రేవంత్ రెడ్డి

by Mahesh |   ( Updated:2023-03-29 12:23:59.0  )
ఇది మోడీ కుటిల నీతికి నిదర్శనం: రేవంత్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: యూపీఐ లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం ఛార్జీలు వసూలు చేయబోతున్నట్లు వస్తున్న వార్తలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పారదర్శక చెల్లింపుల పేరుతో ప్రజలను ఆన్‌లైన్ చెల్లింపుల వైపు మళ్లించి..ఇప్పుడు ఆ చెల్లింపులపై 1.1 శాతం ఛార్జ్ వసూలు చేయడం మోడీ కుటిల నీతికి నిదర్శనం అని మండిపడ్డారు. రూ.10 లక్షల కోట్ల ట్రాన్సాక్షన్లపై 1.1 శాతం పన్ను అంటే ప్రజలపై రూ.11 వేల కోట్ల భారం ప్రతి ఏటా మోపబోతున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు.

మోడీ హఠావో-దేశ్ బచావో! అంటూ బుధవారం ఆయన ట్వీట్ చేశారు. కాగా, యూపీఐ ద్వారా నిర్వహించే వ్యాపార లావాదేవీలపై 1.1 శాతం చార్జీ వసూలు చేసుకునే వీలుగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఇటీవల విడుదల చేసిన సర్క్యులర్‌లో పేర్కొంది. ఎన్‌పీసీఐ ఇటీవలి సర్క్యులర్‌లో ఏప్రిల్ 1 నుండి యూపీఐలో రూ.2 వేల కంటే ఎక్కువ మర్చంట్ లావాదేవీలపై 1.1 పీపీఐ ఛార్జీలు వర్తింపజేయాలని సిఫార్సు చేసింది. ఈ నిర్ణయంపై విపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed