- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BREAKING: ముగిసిన రేవంత్, బాబు భేటీ.. విభజన సమస్యల పరిష్కారం కోసం సంచలన నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్: ప్రజా భవన్ వేదికగా జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ముగిసింది. గత పదేండ్లుగా పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర విభజన అంశాల పరిష్కారం కోసం ఈ భేటీలో తెలంగాణ, ఏపీ సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం కోసం రెండు కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మంత్రుల నేతృత్వంలో ఒక కమిటీ, అధికారుల స్థాయిలో మరొక కమిటీ వేయాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు డెసిషన్ తీసుకున్నాయి. ఈ కమిటీలు గత పదేండ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమస్యల పరిష్కార కోసం చర్చలు జరపనున్నాయి. మంత్రుల కమిటీలో తెలంగాణ నుండి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, హైదరాబాద్‌లోని ప్రజా భవన్ వేదికగా సాయంత్రం 6.10 నిమిషాలకు స్టార్ట్ అయిన ఈ భేటీ.. దాదాపు గంటన్నర పాటు సాగింది.