తెలంగాణ CMగా రేవంత్ రెడ్డి.. మహేష్ బాబు స్పెషల్ ట్వీట్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-12-09 02:08:30.0  )
తెలంగాణ CMగా రేవంత్ రెడ్డి.. మహేష్ బాబు స్పెషల్ ట్వీట్!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి స్టార్ హీరో మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. రాష్ట్రాన్ని విజయం, శ్రేయస్సు, అభివృద్ధి చేసి కొత్త శిఖరాల వైపు నడిపించాలి.’ అని మహేష్ బాబు ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం మహేష్ బాబు ట్వీట్ వైరల్ అవుతోంది. అయితే మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ సినిమాలో సీఎంగా నటించారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తుండగా ఆయన వాయిస్‌కు ‘భరత్ అనే నేను’ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మిక్స్ చేసిన ఇన్ స్టా రీల్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

Advertisement

Next Story