48 గంటలుగా ఎల్లా హోటల్లోనే రేవంత్, ఎమ్మెల్యేలు

by GSrikanth |
48 గంటలుగా ఎల్లా హోటల్లోనే రేవంత్, ఎమ్మెల్యేలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సీఎం ఎవరనేది ఇవాళ సాయంత్రం తెలియనున్నది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీలో మంతనాలు చేపట్టి తిరుగుప్రయాణం అయ్యారు. అయితే 48 గంటల నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, గెలిచిన ఎమ్మెల్యేలు ఎల్లా హోటల్‌‌లోనే ఉంటున్నారు. హోటల్ నుంచే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్ర నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. స్థానిక కాంగ్రెస్ నేతలు హోటల్‌లోనే రేవంత్‌ను కలుస్తున్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు నిన్నటి నుంచి ఆయన హోటల్‌లోనే ఉన్నారు. నిన్నటి నుంచి రేవంత్ హోటల్ నుంచి బయటకు రావడంలేదు. మరోవైపు ఆ హోటల్‌కు భారీ భద్రత నడుమ ఉంది. అందరి ఎమ్మెల్యేలకు వేరు వేరు రూములు కేటాయించినట్లు సమాచారం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్‌లోని రేవంత్ ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story

Most Viewed