Revanth: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ట్రాన్స్‌జెండర్ల పాలాభిషేకం

by Ramesh Goud |
Revanth: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ట్రాన్స్‌జెండర్ల పాలాభిషేకం
X

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ ట్రాన్స్ జెండర్లు(Transgenders) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy)కి పాలాభిషేకం (Anointed With Milk)నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) ఇటీవల ట్రాన్స్ జెండర్లను ట్రాఫిక్ వాలంటీర్లు(Traffic Volunteers)గా విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం పట్ల ఆనందం వ్యక్తం చేసిన ట్రాన్స్ జెండర్లు.. హైదరాబాద్(Hyderabad) బషీర్‌బాగ్(Basheer Bagh) చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రేవంతన్న జిందాబాద్ అని పలు నినాదాలు చేశారు. సమాజంలో వివక్షకు గురవుతున్న తమను కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు. తమను ట్రాపిక్ విధుల్లోకి తీసుకున్నందుకు రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Next Story