Madhu Yashki Goud : రేవంత్, మల్లన్న డ్రామాలు ఆడుతున్నారు : మధు యాష్కీ గౌడ్

by M.Rajitha |
Madhu Yashki Goud : రేవంత్, మల్లన్న డ్రామాలు ఆడుతున్నారు : మధు యాష్కీ గౌడ్
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్(Madhu Yashki Goud) సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అంతా సమానమే అని, హద్దులు మీరితే ఎవరైనా సరే.. వారిపై చర్యలు ఉండటం సహజమే అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని, అయితే అధిష్టానం అందరినీ ఒకేలా చూడాలని.. ఒకే రకమైన చర్యలు ఉండాలని విన్నవించారు. తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) తన హద్దులు దాటి ప్రవర్తించారని, ఆయన వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం అన్నారు. మల్లన్న, రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడని.. మరి ఇపుడు అందరిలాగే మల్లన్నపై చర్యలు తీసుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. వారు ఇరువురు కలిసి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కులగణన సర్వే(Cast Census Survey)పై, ఆ సర్వేలో ప్రకటించిన బీసీల లెక్కలపై చేస్తున్న ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కులగణనపై చిత్తశుద్ధితో ఉన్నారని, ఆయన కీలక ఆదేశాలతోనే ఈ సర్వే జరిగిందని తెలిపారు. అయితే రాష్ట్రంలోని కొందరు నాయకులు కావాలనే సర్వేను నిర్వీర్యం చేస్తున్నారని, అధిష్టానానికి తప్పుడు లెక్కలు అందిస్తున్నారని మధుయాష్కీ మండిపడ్డారు.

Next Story