చంద్రబాబు రిక్వెస్ట్‌ను తిరస్కరించిన రేవంత్ సర్కార్.. ఏపీ CM ఏమి అడిగారంటే..?

by Satheesh |   ( Updated:2024-07-06 15:23:38.0  )
చంద్రబాబు రిక్వెస్ట్‌ను తిరస్కరించిన రేవంత్ సర్కార్.. ఏపీ CM ఏమి అడిగారంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజా భవన్ వేదికగా జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ముగిసింది. సాయంత్రం ఆరు గంటలకు మొదలైన ఈ సమావేశం దాదాపు రెండు గంటల పాటు సాగింది. గత పదేండ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశాల పరిష్కారం కోసం తెలంగాణ, ఏపీ సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఈ భేటీలో డిస్కస్ చేశారు. చర్చల అనంతరం రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం కోసం రెండు కమిటీలు వేయాలని ఇరు రాష్ట్రాల సీఎంలు నిర్ణయించారు. రెండు రాష్ట్రాలకు చెందిన మంత్రులతో కూడిన కమిటీ, అధికారులతో కూడిన కమిటీ ఒకటి వేసి నిర్ణీత సమయంలో సమ్యసలను పరిష్కారించుకోవాలని డిసైడ్ అయ్యారు. అయితే, ఈ భేటీలో ఏపీ సీఎం చంద్రబాబు చేసిన ఒక రిక్వెస్ట్‌ను రేవంత్ రెడ్డి సర్కార్ తిరస్కరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్ల కాలం ముగిసిన నేపథ్యంలో..

హైదరాబాద్‌లో కొన్ని భవనాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరినట్లు తెలుస్తోంది. ఈ రిక్వెస్ట్‌ను తెలంగాణ సర్కార్ సున్నితంగా తిరస్కరించినట్లు టాక్. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలోని స్థిరాస్తులు ఇచ్చే ప్రసక్తే లేదని ఏపీ ప్రభుత్వానికి తేల్చి చెప్పినట్లు టాక్. కావాలంటే ఏపీ ప్రభుత్వం ఆర్జీ పెట్టుకుంటే తెలంగాణలో భూమి కేటాయిస్తామని స్పష్టం చేసినట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఉన్నస్థిరాస్తులు మొత్తం తెలంగాణకు చెందుతాయని చంద్రబాబుకు ఖరాకండిగా చెప్పినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఏపీ భవన్ మాదిరిగా తెలంగాణలో భవనం కట్టుకునేందుకు పర్మిషన్ ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు టాక్. కాగా, ఈ ఏడాది జూన్ 2వ తేదీతో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా టైమ్ అయిపోవడంతో.. హైదరాబాద్‌లో ఇన్ని రోజుల ఏపీ ఉపయోగించుకున్న భవనాలన్నింటీని వెంటనే స్వాధీనం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed