SLBC సొరంగంలో కాల్వల పారుతున్న నీరు.. రెస్క్యూకు తీవ్ర ఇబ్బంది

by Mahesh |
SLBC సొరంగంలో కాల్వల పారుతున్న నీరు.. రెస్క్యూకు తీవ్ర ఇబ్బంది
X

దిశ, అచ్చంపేట : ఎస్ఎల్బీసీ సొరంగంలో మిగిలిన ఏడు మంది డెడ్ బాడీ ల కోసం జరుగుతున్న సహాయక చర్యలు సోమవారం నాటికి 24వ రోజుకు చేరుకున్నాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో ప్రధానంగా సింగరేణి, దక్షిణ మధ్య రైల్వే, రాట్ హోల్ మైనర్స్,, ఇతర బృందాలు రౌండ్ ది క్లాక్ నిర్వహిస్తున్నారు. అయితే గడచిన 24 రోజులుగా సహాయక చర్యలను డిజాస్టర్ మేనేజ్మెంట్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, కలెక్టర్ బాదావత్ సంతోష్చ ఎస్పీ రఘునాథ్ గైక్వాడ్ లు ఇతర రెస్క్యూ బృందాలు, ఉన్నత ఉన్నతాధికారులతో రివ్యూ సమావేశం ఏర్పాటు చేసి తగిన సలహాలు సూచనలు మార్పులు చేర్పులతో సహాయక చర్యలు వేగవంతం జరిగేలా కృషి చేస్తున్నారు.

సొరంగంలో కాలువలా పారుతున్న నీరు

ఎస్ఎల్బీసీ సొరంగంలో ఊట నీరు ఏమాత్రం తగ్గకుండా సొరంగంలో 13.5 కిలోమీటర్ల తర్వాత ఏర్పాటుచేసిన డి2 ప్రాంతంలో ఒక కాలువల పెరుగుతుండడంతో సహాయక చర్యలకు ప్రధాన అడ్డంకిగా మారుతుంది. నీటిని డివాటరింగ్ చేసేందుకు అధికారులు ప్రతి రెండున్నర కిలోమీటర్ల దూరంలో పంపింగ్ మోటార్ ఏర్పాటు చేసి నీటిని బయటకు పంపి చర్యలు తీసుకుంటున్నప్పటికీ వరద ప్రవాహం ఎక్కడ తగ్గకుండా రోజు రోజుకు నీరు కాలువలా పారుతుంది. గత నాలుగు రోజుల నుంచి ప్రభుత్వం ఆదేశించిన మాదిరిగా రోబో సేవలను ఉపయోగించి సహాయక చర్యలు వేగం చేయాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

కానీ సాంకేతిక అడ్డంకులను అధిగమిస్తూ రోబో పనితీరు మొదలుపెట్టేలా పూర్తిస్థాయిలో రోబో సేవలు అందుబాటులోకి సోమవారం నుంచి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టిబిటి మిషన్ శకలాలను దక్షిణ మధ్య రైల్వే కు చెందిన రెస్క్యూ టీం వాటిని కట్ చేస్తూ భాగాలను బయటకు పంపుతున్నారు. అలాగే డి వన్ అతి ప్రమాద స్థలం గా గుర్తించిన అధికార యంత్రాంగం ఆ ప్రదేశంలో ఆచితూచి అడుగులు వేస్తూ సహాయక చర్యల్లో పాల్గొంటున్న వారికి ఎలాంటి చిన్న హాని కలగకుండా ఏడు మంది మృతుల కోసం అన్వేషణ కొనసాగిస్తున్న ఉన్నారు.

Next Story

Most Viewed