- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏడాది పాటు గణతంత్ర దినోత్సవ వేడుకలు
by GSrikanth |
X
దిశ, బెబ్‌డెస్క్: గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సామాజిక తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్(STSA) కీలక నిర్ణయం తీసుకుంది. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఏడాదిపాటు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని ఓయూ క్యాంపస్‌లో జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా మాక్ ఓటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా వచ్చిన ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ చింత గణేష్ మాట్లాడుతూ.. ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనకపోవడంపై ఆవేదన చెందారు. ఓటు హక్కుకు ఉన్న ప్రాధాన్యతకు మరోసారి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా యువత ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. డబ్బు, మద్యం ప్రభావం పెరగడం వల్లే ప్రజలు దారి తప్పుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో STSA విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
Advertisement
Next Story