- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాంగ్ స్టేఫ్.. రాజకీయ భవితవ్యం తెలియక సతమతం!
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్, టీడీపీతో పాటు ఇతర పార్టీల్లో కీలక నేతలుగా ఎదిగారు. రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసినవారు కొందరైతే మరికొందరు రాష్ట్ర కమిటీల్లోనూ కీలక పదవుల్లో పనిచేశారు. ప్రజాసమస్యలపై పోరాడి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాంగ్ స్టేఫ్ వేశామని పలువురు నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని భావించారు. ఎన్నికలకు నెలరోజుల ముందు కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన నేతలు గులాబీ కండువాను కప్పుకున్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోగా, పార్టీ పదవులు సైతం రాలేదు.
దీంతో తొండరపడి పార్టీ మారామా? అని లోలోన బాధపడుతున్నారు. ఎన్నికలకు పార్టీ మారిన వారిలో సీనియర్ నేతలు సంభాని చంద్రశేఖర్, మానవతారాయ్, రాగిడి లక్ష్మారెడ్డి, పటేల్ ప్రభాకర్ రెడ్డి, బిల్యానాయక్, రావుల చంద్రశేఖర్ రెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్, ఎర్ర శేఖర్, దాసోజు శ్రవణ్, చెరుకు సుధాకర్, జిట్టా బాలకృష్ణారెడ్డి, స్వామిగౌడ్, భిక్షమయ్యగౌడ్, ధరువు ఎల్లన్న, ఏపూరి సోమన్న ఇలా చాలామంది నేతలు ఉన్నారు. అయితే వారు ఆశించినదానికి ఫలితం రివర్స్ వచ్చింది. ఏళ్ల తరబడి పనిచేసిన కాంగ్రెస్ పార్టీని కాదని చేరిన నేతలతో పాటు ఇతర పార్టీల సైతం తొందరపడ్డామా? అని మధనపడుతున్నారు. హస్తంపార్టీలో ఉన్నా, ఆ పార్టీలోకి వెళ్తే తమకు ప్రాధాన్యత దక్కేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అప్పుడు, ఇప్పుడూ ప్రతిపక్షంలోనే..
గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నాయకులకు కాలం కలిసి వచ్చింది. ఎమ్మెల్యేలుగా విజయం సాధించడంతో పాటు పార్టీలోనూ కీలకంగా మారారు. కానీ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన నేతలకు మాత్రం దురదృష్టం వెంటాడుతోంది. ఏళ్లుగా పార్టీలో పనిచేసి ఎన్నికల ముందు పార్టీని వీడటం, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో వారు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్షంలో ఉండటం, మళ్లీ అధికారంలోకి వస్తుందని భావించి కాంగ్రెస్‌ను విడిచి బీఆర్ఎస్‌లో చేరిన తర్వాత అధికారం కోల్పోయి ప్రతిపక్షానికి పరిమితం కావడంతో నేతలు అయోమయంలో పడ్డారు. తమ రాజకీయ భవిత్వం తెలియక మనోవేదనకు గురవుతున్నారు. ఇప్పటికే రాజకీయాలను నమ్ముకొని ఆర్థికంగా కుంగిపోయామని, తీరా కేసీఆర్‌ను నమ్ముకున్నా గట్టెక్కలేకపోయామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లోక్ సభ సీట్లపై ఆశలు
లోక్ సభ ఎన్నికలు త్వరలోనే రానున్నాయి. ఆ సీట్లపై బీఆర్ఎస్‌లో చాలామంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఇతర పార్టీల నుంచి చేరినవారు సైతం ఆశిస్తున్నారు. అయితే ఇప్పటివరకు టికెట్లపై గులాబీ అధిష్టానం క్లారిటీ ఇవ్వలేదు. ఎన్నికలకు కేడర్‌ను సిద్ధం చేసుకుంటే టికెట్ వస్తుందా? రాదా? అనే ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఆర్థికంగా కుంగిన నేతలు పార్లమెంట్‌కు సిద్ధమైతే టికెట్ రాకుంటే మరింత ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. పార్టీ భరోసా ఇస్తే ప్రచారం చేసుకునేందుకు పలువురు నేతలు ఆసక్తి చూపుతున్నారు.