- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణతో పాటే మోడీ సర్కార్ ముందస్తుకు వెళ్లే ఛాన్స్: రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీ ఇద్దరూ ఒక్కటేనని.. తెలంగాణ ఎన్నికలతో పాటే మోడీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్నారు. ఆదివారం ఖమ్మంలో విలేకరులతో మాట్లాడిన రేణుకా చౌదరి.. బీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉంటారనే బండి సంజయ్‌ని మార్చి కిషన్ రెడ్డిని బీజేపీకి అధ్యక్షుడిగా నియమించారని ఆరోపించారు.
రాహుల్ గాంధీ ఖమ్మం సభతో బీఆర్ఎస్, బీజేపీలో భయం మొదలైందన్నారు. కాంగ్రెస్‌లో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తెలంగాణలో బీజేపీకి అడ్రస్ లేదని, బీఆర్ఎస్ గుర్తు కారు నాలుగు టైర్లలో గాలి పోయిందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 70-100 సీట్లు కోల్పోబోతున్నదని జోస్యం చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వమే రాబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు.