- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారీగా బోగస్ ఓట్ల తొలగింపు.. ఎంఐఎంకు ఎఫెక్ట్ తప్పదా..?
దిశ, హైదరాబాద్ బ్యూరో : జిల్లాలో బోగస్ ఓట్ల తొలగింపు ఎంఐఎంపై పడనుందా అంటే అవుననే సమాధానాలు వినబడుతున్నాయి. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలలో గత ఏడాది జనవరి నుంచి అధికారులు 5 లక్షలకు పైగా నకిలీ ఓట్లను తొలగించారు. అయితే ఈ ఓట్లన్నీ మైనార్టీ ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గాలకు చెందినవి కావడంతో త్వరలో జరుగబోయే ఎన్నికలలో ఎంఐఎంపై ప్రభావం చూపే అవకాశాలు అధికంగా ఉన్నాయి. జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలలో 7 అసెంబ్లీ స్థానాలు ఎంఐఎం చేతిలో ఉన్నాయి. ఇవే కాకుండా మరో మూడు నుంచి నాలుగు నియోజకవర్గాలలో మైనార్టీల ఓట్లు కీలకంగా మారాయి.
ఈ నేపథ్యంలో నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పలుమార్లు పోటీ చేసి ఓటమిపాలైన ఫెరోజ్ ఖాన్ బోగస్ ఓట్ల తొలగింపు యుద్ధం మొదలుపెట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు బోగస్ ఓట్లను తొలగించాలని ఫిర్యాదు చేశారు. చివరకు న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారు. అలాగే హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవీలత సైతం పాతబస్తీలో బోగస్ ఓట్లను తొలగించాలని ఫిర్యాదులు చేశారు. దీంతో ఎన్నికల సంఘం ఇతర అన్ని నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిసారించి బోగస్ ఓట్ల ఏరివేతకు చర్యలు తీసుకుంది. ఇలా తొలగించిన ఓట్లలో అధికశాతం ఎంఐఎం ప్రభావిత ప్రాంతాలలో ఉండడంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం లేకపోలేదని అభిప్రాయాలు వినబడుతున్నాయి.
నాంపల్లి నియోజకవర్గంలో అధికం..
బోగస్ ఓట్ల తొలగింపు ప్రభావం నాంపల్లి నియోజకవర్గంలో అధికంగా ఉంది. ఈ నియోజకవర్గంలో మొత్తం 21,407 బోగస్ ఓట్లను గుర్తించారు. తొలగించిన వారిలో 15,963 మంది ఇండ్లు మారగా 2,843 మంది చనిపోయారు. 2,601 డూప్లికేట్ ఓటర్లు ఉండడంతో వారిని జాబితా నుంచి తొలగించారు. అలాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 21,222 ఓట్లను అధికారులు తొలగించారు. వీటిలో 16,658 మంది షిప్ట్ అయిన వారు కాగా 3,754 బోగస్ ఓటర్లు, 810 మంది చనిపోయిన వారు ఉన్నారు. ఇక కార్వాన్ నియోజకవర్గంలో 20,722 మంది ఓట్లను తొలగించారు. వీరిలో 12,527 మంది ఇండ్లు మారగా 4,827 మంది బోగస్ ఓటర్లు ఉన్నారు. మరో 3,358 మంది చనిపోయినట్లు అధికారులు గుర్తించి వారిని జాబితా నుంచి తొలగించారు. ఇవే కాకుండా పాతబస్తీ పరిధిలోని చాంద్రాయణ్‌గుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురా పరిధిలో బోగస్ ఓట్లను అధికారులు పెద్ద మొత్తంలో తొలగించడంతో దీని ప్రభావం ఫలితాలపై చూపే అవకాశం ఉంది.
ఇలా తొలగించారు..
సుమారు పదిహేను నెలలుగా జిల్లాలో బోగస్ ఓట్ల తొలగింపునకు అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లు వేయని వారు, ఇండ్లు మారినవారు, చనిపోయిన వారిని గుర్తించి ఓట్లను జాబితా నుంచి తొలగించారు. 2023 జనవరి నుంచి హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 5,41,259 మంది పేర్లను జాబితా నుంచి తొలగించారు. వీరిలో 47,141 మంది మరణించారని, 4,39,801 మంది ఇండ్లు మారారని, 54,259 మంది నకిలీ ఓటర్లు ఉన్నారని ఎన్నికల అధికారులు గుర్తించారు. ఈ ఏడాది జనవరిలో సవరించిన ఓటర్ల జాబితా ప్రకారం హైదరాబాద్ జిల్లాలోని అన్ని సెగ్మెంట్లలో కలిపి సుమారు 45.7 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు.
ఇది గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే సుమారు 33 వేలకు పైగా అధికంగా ఉంది. అయితే ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం అధికారులు పోలింగ్‌కు హాజరుకాని ఇండ్లపై ప్రత్యేక దృష్టిసారించి కొన్నింటిని బోగస్ ఓట్లుగా గుర్తించారు. ఇవే కాకుండా మృతిచెందిన వారు, ఇండ్లు మారిన వారు మొత్తంతో కలిపి 1,09,117 ఓట్లు తొలగించారు. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా సగటు ఓటర్ల జనాభా నిష్పత్తి 68 శాతంగా ఉండగా హైదరాబాద్ జిల్లాలో ఇది 75.3 శాతంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం లక్షకు పైగా ఓట్లు తొలగించకుండా ఉంటే ఇది మరింత అధికంగా ఉండేది.
భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానం ప్రకారం ఫారం 7, ఫారం 8ని సేకరించే విధానం ప్రకారం అన్ని తొలగింపులు జరిగాయని అధికారులు తెలిపారు. ఇంకా, ఓటర్ల జాబితాల ప్రక్షాళన సమయంలో చాలా మంది ఓటర్ల జాబితాలపై ప్రామాణికం కాని ఇంటి నంబర్ ఉన్నట్లు గమనించారు. దీంతో అటువంటి ఓటర్లను గుర్తించి సవరణలు చేయడానికి డ్రైవ్‌ను చేపట్టారు. దీని ప్రకారం మొత్తం 1,81,405 మంది ఓటర్లు నాన్‌స్టాండర్డ్ ఇంటి నంబర్లను గుర్తించి వారి ఇంటి నంబర్లలో అధికారులు సవరణలు చేశారు.