హోల్డ్‌లో పెట్టిన టెన్త్ ఫలితాలు ప్రకటించండి: హైకోర్టు

by GSrikanth |   ( Updated:2023-09-07 07:17:57.0  )
హోల్డ్‌లో పెట్టిన టెన్త్ ఫలితాలు ప్రకటించండి: హైకోర్టు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హన్మకొండ జిల్లా కమలాపురంలో పదోతరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థి హరీష్ రాసిన పరీక్షల ఫలితాలను వెంటనే ప్రకటించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. 10వ తరగతి పరీక్ష జరుగుతున్న సమయంలో కమలాపూర్ లో హిందీ పేపర్ లీకేజీ కలకలం రేపింది. కొందరు నిందితులు పరీక్ష కేంద్రంలోని హరీష్ వద్ద ఉన్న క్వశ్చన్ పేపర్ ఫోటో తీసుకుని వాట్సాప్ లో పెట్టిన విషయం తెలిసిందే.

ఈ విషయం తెలిసిన వెంటనే డీఈవో హరీశ్ ను డిబార్ చేశారు. దీనిపై హరీష్ అప్పట్లో కోర్టుకు వెళ్లగా కోర్టు ఆదేశాలతో తిరిగి పరీక్ష రాశాడు. అనంతరం అందరి ఫలితాలను ప్రకటించిన అధికారులు హరీశ్ ఫలితాలను మాత్రం హోల్డ్ లో పెట్టారు. తాను రాసిన పరీక్షలకు సంబంధించిన ఫలితాలు ప్రకటించాలని కోర్టును ఆశ్రయించడంతో హరీష్ పై డీబార్ ఉత్తర్వులు కొట్టివేసిన హైకోర్టు.. పరీక్షల ఫలితాలను వెంటనే ప్రకటించాలని ఆదేశించింది.

Advertisement

Next Story

Most Viewed