మండుతున్న ఎండలు.. శుభవార్త చెప్పిన వాతావరణ శాఖ

by GSrikanth |
మండుతున్న ఎండలు.. శుభవార్త చెప్పిన వాతావరణ శాఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: భానుడి భగభగలతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ ఊరట కలిగించే వార్త చెప్పింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది. ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కరిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని అంచనా వేసింది.

కాగా, గత మూడు నాలుగు రోజుల నుంచి దంచిన కొడుతున్న ఎండలతో ప్రజలు అల్లాడిపోయారు. అనేక ప్రాంతాల్లో మాడు పగిలేలా భానుడు ప్రతాపం చూపించగా కొన్ని చోట్ల 46 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హడలెత్తిస్తున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితేనే బయటకు రావాలనే సూచనలు అధికారులు చేశారు. వడగాల్పులు, ఉక్కపోతతో సతమతం అవుతున్న ప్రజలకు తాజాగా వాన కబురు కాస్త ఉపశమనం ఇస్తోంది.

Advertisement

Next Story

Most Viewed