Phone Tapping Case: తెలంగాణ హైకోర్టులో హరీష్‌రావుకు ఊరట

by Gantepaka Srikanth |
Phone Tapping Case: తెలంగాణ హైకోర్టులో హరీష్‌రావుకు ఊరట
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ హైకోర్టు(Telangana High Court)లో బీఆర్ఎస్(BRS) ముఖ్య నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు(Harish Rao)కు ఊరట లభించింది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు(Phone Tapping Case)లో వచ్చే ఫిబ్రవరి 5వ తేదీ వరకు హరీష్‌రావును అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పంజాగుట్ట పీఎస్‌లో తనపై నమోదైన FIRను క్వాష్‌ చేయాలని హైకోర్టులో హరీష్‌ రావు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో వచ్చేనెల 5న వాదనలు వినిపిస్తామన్న పీపీ పేర్కొన్నారు.

కాగా, హైదరాబాద్‌ పంజాగుట్ట పోలీసు స్టేషన్‌(Panjagutta PS)లో కాంగ్రెస్ నేత జి.చక్రధర్‌గౌడ్‌ హరీష్ రావుపై ఫిర్యాదు చేశారు. హరీష్ రావు తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని కంప్లైంట్‌లో పేర్కొన్నారు. తన ఫోన్‌తో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లను ఇంటెలిజెన్స్ విభాగం సహకారంతో ట్యాప్ చేశారని, దీని వెనుక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న హరీష్ రావు హస్తం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. చక్రధర్ గౌడ్ ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసులో ఏ1గా హరీష్ రావు, ఏ2గా టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌ను పేర్కొన్నారు. దీంతో రాజకీయ కక్షతో తనపై ఇచ్చిన కేసును కొట్టివేయాలని కోరుతూ హరీశ్‌రావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అరెస్ట్‌ చేస్తే తన రాజకీయ జీవితంతోపాటు ప్రతిష్ట దెబ్బతింటాయన్నారు.

Advertisement

Next Story

Most Viewed