- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వృద్ధ ఖైదీలను విడుదల చేయండి.. ప్రభుత్వానికి ఎమ్మెల్యే కూనంనేని విజ్ఞప్తి

X
దిశ, తెలంగాణ బ్యూరో : కారాగారాలలో చాలా ఏళ్లుగా శిక్షను అనుభవిస్తున్న 60 సంవత్సరాలు దాటిన వృద్ధ ఖైదీలను విడదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఇవాళ సీఎం రేవంత్‌రెడ్డిని విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు. నూతన సంవత్సరం, రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఖైదీలను విడుదల చేయాల్సింది ఎమ్మెల్యే కూనంనేని ప్రభుత్వానికి విన్నవించారు. కొంతమంది ఖైదీలు దీర్ఘ వ్యాధులతో బాధపడుతున్న వారు, సత్ప్రవర్తన కలిగిన దీర్ఘ కాలికంగా జైలులో మగ్గుతున్న ఖైదీలను నూతన ప్రభుత్వ కానుకగా మానవతా దృక్పథంతో వారందరిని విడుదల చేయాలని కూనంనేని సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
Next Story