DSC దరఖాస్తుల స్వీకరణ క్లోజ్.. మొత్తం ఎన్ని అప్లికేషన్లు వచ్చాయంటే..?

by Satheesh |
DSC దరఖాస్తుల స్వీకరణ క్లోజ్.. మొత్తం ఎన్ని అప్లికేషన్లు వచ్చాయంటే..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గురువారం అర్ధరాత్రితో ముగిసింది. కాగా మొత్తం 2,79,956 అప్లికేషన్లు వచ్చినట్లు విద్యాశాఖ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో వచ్చిన దరఖాస్తులకు అదనంగా మరో లక్ష మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ కింద మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గత నెల 29న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో 2,629 స్కూల్‌ అసిస్టెంట్, ఎస్జీటీలు 6,508, భాషా పండితులు 727, పీఈటీలు 182, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) 796 పోస్టులు ఉన్నాయి.

కాగా స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు 1,61,746 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్జీటీకి 88,007, భాషా పండితులు 18,211, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుకు 11,992 మంది దరఖాస్తు చేసుకున్నారు. వాస్తవానికి ఏప్రిల్​4వ తేదీతో డీఎస్సీ దరఖాస్తు గడువు ముగిసింది. అయితే డీఎస్సీకి ముందే టెట్ నిర్వహించాలన్న నిరుద్యోగుల డిమాండ్‌కు తెలంగాణ ప్రభుత్వం జూన్ 20 వరకు దరఖాస్తుల గడువు పెంచింది. కాగా వచ్చే నెల 17 నుంచి 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed