- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాకు రెడీ.. CM రేవంత్‌కు హరీష్ రావు మరో సవాల్
దిశ, వెబ్‌డెస్క్: స్పీకర్ ఫార్మాట్‌లో తాను రాజీనామా చేయడానికి సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు మరో సవాల్ విసిరారు. తనతో పాటు సీఎం రేవంత్ రెడ్డి రాజీనామాకు సిద్ధమా? అని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజీనామా చేయలేకపోతే కొడంగల్ చౌరస్తాలో ముక్కు నేలకు రాయడానికైనా రెడీగా ఉండాలని అన్నారు. రాజీనామా విషయంలో నేను మొన్న చెప్పా, ఇప్పుడు చెప్తున్నా.. ఆగస్టు 15 లోపు 6 హామీలు, 2 లక్షల రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తానని గొంతెత్తి చెప్పారు. లేకుంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రామిసరీ నోట్లు చూపించాడన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దేవుడి మీద ఒట్లు వేసుకుంటూ కొత్త నాటకం మొదలుపెట్టాడని మండిపడ్డారు. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నాడు.. ఇప్పుడేమో ఆగస్టు 15 వరకు అని కొత్త నాటకం ఆడుతున్నాడని హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.