- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చేనేత రంగాన్ని కాపాడేందుకు ప్రైవేటు బిల్లుకు సిద్ధం: ఎన్ఎఫ్‌హెచ్‌హెచ్ సమావేశంలో ఎంపీలు
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో చేనేత రంగాన్ని, చేతి వృతులకు కాపాడేందుకు పార్లమెంట్‌లో ప్రైవేటు బిల్లు ప్రవేశ పెట్టేందుకు తాము సిద్ధమని ఎంపీలు ముక్తకంఠంతో తెలిపారు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ (NFHH) ఆధ్వర్యంలో నిర్వహించిన చేనేత- చేతి వృత్తులపై కాన్స్టిట్యూషనల్ క్లబ్, న్యూఢిల్లీలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పార్లమెంటు సభ్యులు, 10 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీలు మాట్లాడుతూ.. చేనేత రంగం రక్షణ కోసం వచ్చే పార్లమెంట్ సమావేశాలలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెడతామని అన్నారు. అంతే కాకుండా చేనేత పరిశ్రమ, చేతి వృత్తులు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్లమెంటులో ప్రశ్నలు లేవనెత్తి వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం NFHH కన్వీనర్ మాచర్ల మోహన్ రావు మాట్లాడుతూ.. గడిచిన దశాబ్ద కాలంలో చేనేత - చేతివృత్తులకు సంబంధించి కేంద్రంలో బడ్జెట్ ను తగ్గిస్తూ వచ్చారని తెలిపారు. దాంతో చేనేత కార్మికులు రోజువారి పని కోల్పోవడం, సంక్షేమ పథకాలు అందట్లేదని అన్నారు. ఆ రంగాలపై ఆధారపడిన వారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సవితి తల్లి ప్రేమను చూపించడం అన్యాయమని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం చేనేత చేతి వృత్తులపై బడ్జెట్‌ను తగ్గించడం సరికాదని, దీనిపై ప్రధాన మంత్రికి విన్నవించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఎంపీలు తెలిపారు. చేనేత రక్షణ కోసం NFHH ప్రైవేటు బిల్లు ప్రతిపాదిస్తే పార్లమెంటులో ప్రవేశపెడతామని పార్లమెంట్ సభ్యులు హామీ ఇచ్చారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం నుంచి మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బస్తిపాటి నాగరాజు, ఆర్. కృష్ణయ్య (రాజ్యసభ సభ్యులు), పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి జగన్నాథ సర్కార్, మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ అమర్ పట్నాయక్, ఒరిస్సా, పాల్గొన్నారు. అదేవిధంగా 10 రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, నాగాలాండ్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, బీహార్, న్యూఢిల్లీ (భరత్ నగర్ సుందరీ నగర్) రాష్ట్రాలు) నుంచి 50 మంది చేనేత - చేతివృత్తులకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొని తమ తమ రాష్ట్రాలలోని వాస్తవ పరిస్థితులను ఎంపీల దృష్టికి తీసుకువచ్చారు.