రవీందర్ మృతి.. హోంగార్డులకు అధికారుల స్ట్రాంగ్ వార్నింగ్!

by Sathputhe Rajesh |
రవీందర్ మృతి.. హోంగార్డులకు అధికారుల స్ట్రాంగ్ వార్నింగ్!
X

దిశ, వెబ్‌డెస్క్: మూడు రోజుల క్రితం జీతం సరిపోవడం లేదని హోంగార్డు రవీందర్ ఆత్మహత్యాయత్నం చేయగా ఈ రోజు మృతి చెందాడు. ఈ నేపథ్యంలో హోంగార్డులు ఆందోళనకు దిగే ఛాన్స్ ఉందని గ్రహించిన ఉన్నతాధికారులు హోంగార్డులకు తీవ్ర హెచ్చరికలు చేశారు. హోంగార్డులు అందరూ తప్పనిసరిగా డ్యూటీలో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. డ్యూటీలో లేని హోంగార్డులు పోలీస్ స్టేషన్‌లో ఉండాలని సూచించారు. హోంగార్డులు అందరూ అందుబాటులో ఉండేలా ఇన్స్ పెక్టర్లు చర్యలు తీసుకోవాలని అధికారులు తెలిపారు. డ్యూటీకి రాని వారి ఉద్యోగం పోయినట్లేనని సీరియస్‌గా హెచ్చరించారు.

Advertisement

Next Story